రాణా -నతాలియాతో... రామ్ గోపాల్ వర్మ సినిమా
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త సినిమా ప్రకటించారు. దగ్గుబాటి రాణా-నతాలియా జంటగా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందనుందని, అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం వర్మ బాలీవుడ్ లో రూపొందిస్తున్న 'డిపార్ట్‌మెంట్' చిత్రంలో బ్రెజిల్ భామ నతాలియా ఐటం సాంగులో నటిస్తోంది.
ఇంతకు ముందు వర్మ నతాలియా అందచందాల గురించి తెగ పొగిడేసిన విషయం తెలిసిందే. నతాలియా లాంటి అందాన్ని నేను నా సినీ కెరీర్లో ఇదివరకెప్పుడూ చూడలేదని, ఆమె అందం చూసి పిచ్చిక్కిపోతోందని......హింసాత్మక ఘటన నేపథ్యంలో రక్తచరిత్ర సినిమా రూపొందించినట్లుగా, ఆమె 'అందం' గురించి అంతా చర్చించుకునేట్లుగా ఓ సినిమా తీయనున్నట్లు కూడా ప్రకటించారు వర్మ. మరి ఈ సినిమా...రాణా-నతాలియా జంటగా తీయబోయే సినిమా ఒకటేనా? అనేది తేలాల్సి ఉంది. వర్మ ఇప్పటి వరకు బోలెడు కొత్త సినిమాలు ప్రకటించారు. అందులో ఆచరణ వరకు వచ్చినవి చాలా తక్కవ. మరి ఈ సినిమాల సంగతేమిటో కాలమే నిర్ణయించాలి.
ఇక పోతే రాణా నటించిన 'నా ఇష్టం' చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఈచిత్రం తర్వాత రాణా క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్దురుమ్' చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











