సుశాంత్ డెత్: మెగాస్టార్ అల్లుడితో రియా చక్రవర్తి.. ఆశలన్నీ అతనిపైనే..

కరోనా వైరస్ తో ఒక వైపు దేశమంతా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో సుశాంత్ డెత్ అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నేషనల్ మీడియాలో కూడా విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఎక్కువగా రియా చక్రవర్తిపైనే అందరి దృష్టి పడింది. అయితే ఈ హీరోయిన్ మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ తో ఒక సినిమా చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Recommended Video

Sushant Singh Rajput : టాలీవుడ్ మూవీ పై ఆశలు పెట్టుకున్న రియా చక్రవర్తి.. చివరికి ఇలా ! || Oneindia
టాలీవుడ్ ని దూరం పెట్టి..

టాలీవుడ్ ని దూరం పెట్టి..

రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ తో ప్రేమలో పడిన తరువాత ఎక్కువగా బాలీవుడ్ లోనే బిజీగా కనిపించింది. ఆ మధ్య తెలుగులో ఆఫర్స్ వచ్చినా కూడా చేయలేదు. మొదట ఈ బ్యూటీ తెలుగులో తూనిగ..తూనిగ అనే సినిమా చేసింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో టాలీవుడ్ ని దూరం పెట్టి బాలీవుడ్ లో అదృష్టాన్ని పరిక్షించుకుంది.

సూపర్ మచి సినిమాలో రియా

సూపర్ మచి సినిమాలో రియా

బికినీ వేయడానికి కూడా సిద్దమైన రియా కొన్ని బోల్డ్ క్యారెక్టర్స్ తో పరవాలేదు అనిపించే విధంగా హిందీలో క్రేజ్ అందుకుంది. ఇక చాలా రోజుల తరువాత అమ్మడు తెలుగు సినిమాలో నటించింది. మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ చేస్తున్న సూపర్ మచి సినిమాలో రియా కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రచిత రామ్ అనే మరొక హీరోయిన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోనుంది.

ఆశలు గట్టిగానే పెట్టుకుంది

ఆశలు గట్టిగానే పెట్టుకుంది

సూపర్ మచి కథ నచ్చడంతో తక్కువ రెమ్యునరేషన్ కి ఒప్పుకున్న రియా ఆ సినిమాపై ఆశలు గట్టిగానే పెట్టుకుంది. ఎందుకంటే ఈ సినిమా ద్వారా అయినా మళ్ళీ సౌత్ లో నిలదొక్కుకోవాలని అనుకుంటోంది. కళ్యాణ్ దేవ్ అయితే సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక సుశాంత్ డెత్ కేసులో రియా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సూపర్ మచి సినిమా కూడా హాట్ టాపిక్ గా మారింది.

రియా ఇప్పట్లో బిజీ అయ్యేలా లేదు.

రియా ఇప్పట్లో బిజీ అయ్యేలా లేదు.

దాదాపు షూటింగ్ పనులను రియా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతా బాగానే ఉంది కానీ రియాపై వస్తున్న విమర్శల కారణంగా సినిమా ప్రమోషన్స్ ఆమె పాల్గొంటుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. పరిస్థితులను చూస్తుంటే రియా ఇప్పట్లో సినిమాలతో బిజీ అయ్యేలా కనిపించడం లేదు.

రియా సినీ లైఫ్ ఎలా ఉంటుందో..

రియా సినీ లైఫ్ ఎలా ఉంటుందో..

రియాకు మళ్ళీ అవకాశాలు వస్తాయా లేదా అనేది కూడా సందేహంగా మారింది. సోషల్ మీడియాలో ముందు నుంచి ఆమెపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక సుశాంత్ తండ్రి కూడా ఆమె డబ్బు కాజేసినట్లు కేసు నమోదు చెయడంతో విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక ఎలాగైనా నిర్దోషిగా బయటపడాలని రియా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరి కేసు అనంతరం రియా సినీ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X