రియా చక్రవర్తి కాల్‌డేటా లీక్.. షాకింగ్‌గా రకుల్, రానాకు ఫోన్ కాల్స్.. ఇంకా ఎవరెవరి పేర్లంటే!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సుశాంత్ అనుమానాస్పద మరణం, బ్యాంకు అకౌంట్లలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో ఈడీ, సీబీఐ దర్యాప్తు చేయడం తెలిసిందే. రియాను విచారిస్తున్న ఈడీ అధికారులు తాజాగా ఆమె కాల్ డేటాను పరిశీలించగా కొందరు టాలీవుడ్, బాలీవుడ్ వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. రియా కాల్ డేటాలో వెల్లడైన అంశాలు ఏమిటంటే..

Recommended Video

Sushant Singh : Rana తో టచ్‌లో ఉన్న Rhea Chakraborty, కాల్ డేటా లో Tollywood నటుల పేర్లు !
 ఈడీ అధికారుల తనిఖీలో రియా కాల్ డేటా

ఈడీ అధికారుల తనిఖీలో రియా కాల్ డేటా

రియా చక్రవర్తి తాజా కాల్ డేటాను స్వాధీనం చేసుకొన్న అధికారులకు టాలీవుడ్‌కు చెందిన రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, బాలీవుడ్‌కు చెందిన అమీర్ ఖాన్, శ్రద్దాకపూర్, ఆదిత్య రాయ్ కపూర్, దివంగత సరోజ్ ఖాన్ తదితరుల ఫోన్ నంబర్లను గుర్తించారు. ఇంకా పలువురు సినీ నటులతో నిరంతరం టచ్‌లో ఉన్నట్టు కాల్ డేటా స్పష్టం చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్‌కు 30 సార్లు కాల్స్

రకుల్ ప్రీత్ సింగ్‌కు 30 సార్లు కాల్స్

రియా చక్రవర్తి, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఫోన్ కాల్స్ వ్యవహారం భారీగానే జరిగినట్టు తాజా కాల్ డేటా స్పష్టం చేసింది. రకుల్ ప్రీత్ సింగ్‌కు రియా 30 సార్లు కాల్ చేస్తే.. తిరిగి రియాకు రకుల్ ప్రీత్ 14 సార్లు కాల్ చేసినట్టు రికార్డు అయ్యాయి. అంతేకాకుండా పలుమార్లు వారిద్దరు ఎస్ఎంఎస్‌లు కూడా షేర్ చేసుకొన్నట్టు స్పష్టమైంది.

రానా, రియా మధ్య ఫోన్ కాల్స్

రానా, రియా మధ్య ఫోన్ కాల్స్

ఇక బాహుబలితో బాలీవుడ్‌ను కుదిపేసిన రానా దగ్గుబాటితో కూడా రియా చక్రవర్తి టచ్‌లో ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. రానాకు 7 సార్లు కాల్ చేయగా, రానా ఆమెకు నాలుగు సార్లు కాల్ చేశారనేది కాల్ డేటాలో రికార్డు అయినట్టు అధికారులు వెల్లడించారు. అయితే వారి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందనే విషయంపై క్లారిటీ లేకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదిత్య రాయ్ కపూర్‌కు 16 ఫోన్ కాల్స్

ఆదిత్య రాయ్ కపూర్‌కు 16 ఫోన్ కాల్స్

బాలీవుడ్ విషయానికి వస్తే.. అమీర్ ఖాన్‌కు రియా ఓ సారి కాల్ చేస్తే.. ఆయన మూడుసార్లు ఆమెకు మెసేజ్ చేసినట్టు కాల్ డేటాలో స్పష్టమైంది. ఇక ఆదిత్య రాయ్ కపూర్‌కు రియా 16 సార్లు శ్రద్దాకపూర్‌కు మూడుసార్లు కాల్ చేసిందని విషయం బయటకు వచ్చింది. అలాగే ఇటీవల మరణించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్‌కు మూడుసార్లు కాల్ చేసినట్టు సమాచారం.

మహేష్‌ భట్‌తో 16 సార్లు

మహేష్‌ భట్‌తో 16 సార్లు

ఇక తన గురువు, సర్వంగా భావించే దర్శకుడు మహేష్ భట్‌తో ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తున్నది. 2020 జనవరి నెలలోనే వారిద్దరూ 16 సార్లు ఫోన్‌లో మాట్లాడుకొన్నారని స్పష్టమైంది. తొమ్మిది సార్లు రియా కాల్ చేస్తే.. ఏడు సార్లు మహేష్ భట్ కాల్ చేసినట్టు స్పష్టమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X