రియా చక్రవర్తి కాల్‌డేటా లీక్.. ఫోన్‌లో పోలీస్ ఆఫీసర్‌తో.. అతడికి 1122 కాల్స్, మహేష్‌ భట్‌తో కూడా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో జరిగిన కుట్రలు దిగ్బ్రాంతికరంగా వెలుగు చూస్తున్నాయి. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి లీలలన్నీ మరింత అనుమానాస్పదంగా మారుతున్నాయి. తాజాగా ప్రముఖ టెలివిజన్ ఛానెల్ రిపబ్లిక్ టీవీ సంచలనమైన రీతిలో రియా కాల్‌డేటాను బయట పెట్టింది. ఈ కాల్‌డేటాలో రియా చేసిన ఫోన్లు, సంప్రదించిన వ్యక్తుల వివరాలు షాకింగ్‌గా మారాయి. ఇక రియా కాల్‌డేటా వివరాల్లోకి వెళితే..

Recommended Video

Sushant Singh Rajput : షాకింగ్! ముంబై పోలీసులతో రియా చక్రవర్తి మంతనాలు! || Oneindia Telugu
దిశా సలియాన్ డెత్ తర్వాత

దిశా సలియాన్ డెత్ తర్వాత

దిశ సలియాన్ మరణం తర్వాత రియా చక్రవర్తి, సుశాంత్‌ మధ్య గొడవ జరగడం, ఆ తర్వాత ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడం తెలిసిందే. అయితే సుశాంత్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత రియా తనతో దారుణంగా వ్యవహరించిందనే వార్తలు వచ్చాయి. సుశాంత్ కాల్ చేయగా అతడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసినట్టు కాల్ డేటాలో వెలుగు చూసింది.

సుశాంత్ సూసైడ్ అనంతరం పలువురితో

సుశాంత్ సూసైడ్ అనంతరం పలువురితో

సుశాంత్ మరణానికి ముందు, తర్వాత రియా చక్రవర్తి ప్రవర్తన, పలువురు వ్యక్తులతో అనుసరించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారాయి. సుశాంత్ మరణం తర్వాత ముంబై పోలీసు ఉన్నతాధికారితో రియా పలుమార్లు సంభాషించినట్టు టీవీ బయటపెట్టిన కాల్‌డేటాలో వ్యక్తమైంది. ఇటీవల కాలంలో దర్శకుడు మహేష్ భట్, శృతీమోడీ, తండ్రితో ఎక్కువసార్లు మాట్లాడినట్టు సమాచారం.

బాంద్రా డీసీపీతో ఫోన్‌లో సంభాషణ

బాంద్రా డీసీపీతో ఫోన్‌లో సంభాషణ

సుశాంత్ సింగ్ మరణం జూన్ 14వ తేదీన బయటకు వచ్చిన తర్వాత రియా చక్రవర్తి ముంబైలోని బాంద్రా డీసీపీతో టచ్‌లో ఉన్నారు. జూన్ 20 తేదీ నుంచి జూలై 18వ తేదీ వరకు నాలుగు సార్లు ఫోన్‌లో, ఒకసారి ఎస్సెమ్మెస్‌తో సంప్రదింపులు జరిపినట్టు కాల్‌డేటాలో స్పష్టమైంది. సుశాంత్ దర్యాప్తు జరుగుతున్న సమయంలో పోలీస్ ఉన్నతాధికారితో ఫోన్‌లో సంప్రదింపులు చేయడంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

రియాతో పోలీస్ ఉన్నతాధికారికి సంబంధమేమిటి?

రియాతో పోలీస్ ఉన్నతాధికారికి సంబంధమేమిటి?

ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాంటి సంచలన మర్డర్ మిస్టరీపై విచారణ జరుగుతున్నప్పుడు రియా లాంటి వ్యక్తికి బాంద్రా డీసీపీ ఎందుకు ఎస్సెమ్మెస్ పంపారు. ఆ తర్వాత నాలుగు సార్లు ఫోన్‌లో మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకు కోసం వారి మధ్య ఫోన్ సంభాషణ జరిగిందనే అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. అనేక అంశాలు ఇప్పుడు అనుమానాస్పదంగా మారుతున్నాయి.

మహేష్‌భట్ మంతనాలు జరిపిన రియా

మహేష్‌భట్ మంతనాలు జరిపిన రియా

ఇక సుశాంత్ మరణం తర్వాత మహేష్ భట్‌తో రియా చక్రవర్తి 16 సార్లు మాట్లాడినట్టు స్పష్టమైంది. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బిజినెస్ మేనేజర్ శృతి మోడీతో 808 సార్లు సంభాషించినట్టు కాల్ డేటాలో రికార్డు అయింది. ఇక తన తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి‌తో ఏకంగా 1122 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు వెలుగులోకి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X