సూసైడ్ చేసుకోకపోతే రేప్ చేసి చంపేస్తారా: సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని మిగిల్చిన సుశాంత్ సింగ్ సూసైడ్ ఘటనను అతని అభిమానుకు ఇంకా మరచిపోలేకపోతున్నారు. సినీ తారలు కూడా ఇంకా సుశాంత్ ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇటీవల సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సుశాంత్ మరణించి నెలరోజులు అయిన సందర్భంగా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అనంతరం రియాకు బెదిరింపులతో కూడా సందేశాలు వచ్చాయి. ఈ విషయంపై స్పందిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.

మౌనన్నీ చేతకాని తనంగా..

మౌనన్నీ చేతకాని తనంగా..

రియా చక్రవర్తి బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటిసారి ఉహీంచని విధంగా విమర్శలు ఎదుర్కొంటోంది. సుశాంత్ మరణానికి ఆమె కూడా ఒక కారణమని అతను బాధలో ఉన్నప్పుడు మద్దతుగా ఉండి ఉంటే తప్పకుండా బ్రతికి ఉండేవాడిని విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ విమర్శల డోస్ ఎక్కువవ్వడంతో రియా స్పందించక తప్పలేదు. తన మౌనన్నీ చేతకాని తనంగా తీసుకుంటున్నారని ఆమె సీరియస్ గా స్పందించారు.

సూసైడ్ చేసుకోకపోతే..

సూసైడ్ చేసుకోకపోతే..

నువ్వు తప్పకుండా అత్యాచారానికి గురై చంపబడతావు. నువ్వు సూసైడ్ చేసుకోకపోతే నేను మనుషులను పంపి నిన్ను ఎప్పటికైనా చంపేయిస్తాను అంటూ ఒక నెటిజన్ నుంచి బెదిరింపులు రావడం వలన రియా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సమాధానాన్ని కూడా చెప్పింది.

అత్యాచారం చేయించి మర్డర్ చేయిస్తారా..?

అత్యాచారం చేయించి మర్డర్ చేయిస్తారా..?

దొంగా, హంతకురాలు, సిగ్గులేని దానివి అంటూ రకాలుగా నన్ను దూషించారు. అయినా కూడా మౌనంగా ఉండిపోయాను. నేను ఆత్మహత్య చేసుకోకపోతే నన్ను అత్యాచారం చేయించి మర్డర్ చేయిస్తారనే హక్కు మీకు ఎక్కడిది. నేను సిలెంట్ గా ఉండడం వల్ల ఇలా అనుకున్నారా అంటూ అంటూ సదరు నెటిజన్ కి ఆమె కౌంటర్ ఇచ్చారు.

చర్యలు తీసుకోవాలి..

చర్యలు తీసుకోవాలి..

ఇలా చేయడం వల్ల కలిగే ఇబ్బందులను మీరు గ్రహించరా? అంటూ.. ఇది చట్టపరంగా నేరంతో సమానం, ఈ విధంగా ఎవరు కూడా వేధింపులకు గురి కావద్దని నేను మళ్ళీ చెబుతున్నాను అని రియా వివరణ ఇచ్చింది. అలాగే సైబర్ క్రైమ్ ఇండియా వారు ఈ విషయంపై చర్యలు తీలుకోవలని ఆమె ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. దీంతో ఆ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X