4 చుక్కలు.. 30 నిమిషాల్లో ఇంక అంతే.. బయటపడ్డ రియా చక్రవర్తి మరో భాగోతం
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ సంస్థలు రియా చక్రవర్తి వ్యవహారాలపై సీరియస్‌గా దృష్టిపెట్టాయి. ఈ క్రమంలో వెలుగు చూసిన డ్రగ్ డీలర్లతో రియా చక్రవర్తి భాగోతం ఇప్పుడు మీడియాలో చర్చ షాకింగ్‌గా మారింది. డ్రగ్ డీలర్లతో రియా చేసిన వాట్సప్ ఛాటింగ్ మీడియాలో వెలుగు చూడటం సంచలనంగా మారింది. తాజాగా ఓ డీలర్‌తో రియా చేసిన సంభాషణ ఇలా..

వంట మనిషి నీరజ్ చెప్పిన సమాచారంతో
సుశాంత్ మరణం కేసులో వంట మనిషి నీరజ్‌ను ప్రశ్నించిన సమయంలో చెప్పిన విషయాలు సీబీఐ అధికారులకు తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేశాయి. సుశాంత్ మారిజువానా సిగరెట్లు తాగేవారు. వాటిని శ్యామ్యూల్ మిరాండా చుట్టి ఇచ్చే వారని చెప్పిన సమాచారంతో ఈడీ, సీబీఐలు లోతైన విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రియా వాట్సప్ లీక్ కావడం మరింత సంచలనం రేపింది.

డ్రగ్స్ డీలర్స్‌తో రియా చక్రవర్తి
సుశాంత్ మరణానికి ముందు రియా చక్రవర్తి చాలాకాలం డ్రగ్ డీలర్లతో సంప్రదింపులు జరిపారనే విషయం బయటపడింది. పలువురు డ్రగ్ వర్తకులతో వాట్సప్‌లో నిషేధిత మాదక ద్రవ్యాల గురించి చర్చించడం మీడియాలో సెన్సేషన్‌గా మారింది. డ్రగ్ డీలర్‌గా భావిస్తున్న జయా సహాతో చాటింగ్ వైరల్‌గా మారింది.

నిషేధిత డ్రగ్స్ గురించి రియా వాకబు
ముంబైలో ప్రముఖులు అక్రమంగా నిర్వహించే పార్టీలో వాడే నిషేధిత మాదక ద్రవ్యాల గురించి రియా చక్రవర్తి ఆరా తీయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎండీఎంఏ, ఐసీవైఎంఏ, ఎండీఎంఏ లాంటి ఉత్ప్రేరకాల గురించి వాకబు చేసినట్టు రియా చక్రవర్తి ఛాటింగ్ స్పష్టం చేసింది.

డ్రగ్ డొంకను కదిలిస్తున్న సీబీఐ
ఇక డ్రగ్ వాడకం గురించి రియా చక్రవర్తి, జయ సహా మధ్య జరిగిన వాట్సాప్ ఛాటింగ్‌పై ఈడీ, సీబీఐలు దృష్టిపెట్టాయి. లీకైన చాటింగ్‌ను ఆధారంగా చేసుకొని డ్రగ్ మాఫియా తీగ లాడి డొంకను కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. రియాతో జయ మాట్లాడుతూ.. 4 చుక్కలు టీ, కాఫీ, వాటర్‌లో వేసి కలిపి తీసుకోండి.. 30 నుంచి 40 నిమిషాల్లో ముకు కిక్కు బాగా ఎక్కుతుంది అని చెప్పిన విషయంపై ఈడీ దృష్టికి వచ్చింది.
Recommended Video

నార్కోటిక్ బ్యూరో రంగంలోకి
రియా చక్రవర్తి డ్రగ్ డీలింగ్‌పై వివరాలు సేకరించడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. రియా చక్రవర్తి వాట్సప్ చాటింగ్ ద్వారా అనేక విషయాలపై నజర్ పెట్టాం. ఆ దిశగా విచారణ చేపడుతూ డ్రగ్ వ్యవహారంలో ఎవరికి పాత్ర ఉందనే విషయంపై వివరాలు సేకరిస్తాం. ఇందులో ఎవరికైనా పాత్ర ఉంటే వారిని కూడా ప్రశ్నిస్తాం అని ఎన్సీబీ డీజీ రాకేష్ అస్థానా తెలిపారు.


Click it and Unblock the Notifications











