రియా కాల్ డేటా లీక్.. రకుల్ తర్వాత.. సుశాంత్ మరణానంతరం ఆయనతో 1191 సెకన్లపాటు

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు, తర్వాత ప్రియురాలు రియా చక్రవర్తి వ్యవహార తీరు అద్యంతం అనుమానాస్పదంగా మారుతున్నది. సుశాంత్ పక్కనే ఉంటూ ఆయన టార్గెట్‌గా చేసుకొన్న వ్యక్తులతో ఫోన్‌లో సంభాషించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఆమె కాల్‌డేటా రిపబ్లిక్ టెలివిజన్ చేజిక్కించుకొని సంచలన విషయాలను బయటపెట్టింది. కాల్ డేటాలో వెలుగు చూసిన విషయాలు ఏమిటంటే..

Recommended Video

Sushant Singh Rajput : బయటపడుతున్న Rhea ఫోన్ కాల్స్ వివరాలు.. ఎన్నడూ మాట్లాడని వ్యక్తితో...
వివాదాస్పదంగా రియా కాల్ డేటా

వివాదాస్పదంగా రియా కాల్ డేటా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించారనే వార్తతో అందరూ విషాదంలో మునిగిపోయిన సమయంలో రియా చక్రవర్తి అనుమానాస్పద వ్యక్తులతో ఫోన్‌లో సుదీర్ఘంగా సంభాషించడం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరణానికి ముందు మహేష్ భట్, ఇతర ప్రముఖులతో ఫోన్‌లో టచ్‌లో ఉండటం అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రియా ఫోన్ సంభాషణ గురించి పలు రకాల లీకేజ్‌లు వెలుగులోకి వస్తున్నాయి.

టాలీవుడ్ ప్రముఖులతో కూడా

టాలీవుడ్ ప్రముఖులతో కూడా

గత ఆరు నెలల కాలంలో అంటే సుశాంత్ సింగ్ మరణానికి ముందు నాలుగు నెలలు, ఆ తర్వాత రెండు నెలలుగా ఫోన్‌లో పలువురితో సంభాషించినట్టు స్పష్టమైంది. టాలీవుడ్ తారలు రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటితోపాటు అమీర్ ఖాన్ లాంటి ప్రముఖులను కూడా ఆమె లైన్లో పెట్టింది.

సుశాంత్ మేనేజర్‌తో సుదీర్ఘంగా సంభాషణ

సుశాంత్ మేనేజర్‌తో సుదీర్ఘంగా సంభాషణ

తాజాగా రియా చక్రవర్తి కాల్ డేటాను రిపబ్లిక్ టీవీ బయట పెట్టగా.. అందులో సుశాంత్ సింగ్ కేసులో అనుమానాస్పద వ్యక్తి ఆయన మాజీ మేనేజర్ శ్యామ్యూల్ మిరాండాతో సుధీర్ఘంగా సంభాషించారనే విషయం వెలుగులోకి వచ్చింది. జూలై 14వ తేదీన శ్యామ్యూల్ మిరాండాతో 1191 సెకన్లపాటు మాట్లాడినట్టు స్పష్టమైంది.

 ఏడాది కాలంలో శ్యామ్యూల్‌తో

ఏడాది కాలంలో శ్యామ్యూల్‌తో

అయితే శ్యామూల్ మిరాండాతో మాట్లాడటం వెనుక ఓ ట్విస్టు బయటపడింది. గత ఏడాది కాలంలో శ్యామ్యూల్ మిరాండాతో రియా కనీసం కొన్ని సెకన్లు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ సుశాంత్ మరణం తర్వాత అంత సుధీర్ఘంగా ఎందుకు మాట్లాడారనే విషయంపై అధికారులు దృష్టిపెట్టారు. అలా సుధీర్ఘంగా ఏం మాట్లాడారు? ఎందుకు మాట్లాడారనే కోణంలో ఈడీ దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది.

ఈడీ ఉచ్చులో శ్యామూల్ మిరాండా

ఈడీ ఉచ్చులో శ్యామూల్ మిరాండా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ్యాంక్ అకౌంట్ల అవకతవకలను బయటపెట్టేందుకు ఈడీ రంగంలో దూకి రియా, ఆమె కుటుంబ సభ్యులను సుదీర్ఘంగా విచారించింది. ఈ క్రమంలో ఇంటి మేనేజర్ శ్యామ్యూల్ మిరాండాను కూడా మనీలాండరింగ్ కేసులో తొమ్మిది గంటలపాటు విచారించింది.

శ్యామ్యూల్‌పై సీబీఐ గురి

శ్యామ్యూల్‌పై సీబీఐ గురి

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈడీ, సీబీఐ రంగంలోకి దూకాయి. సుశాంత్ సింగ్ ఆర్థిక వ్యవహారాలను చూసే శ్యామ్యూల్ మిరాండాపై కూడా సీబీఐ దృష్టి పెట్టింది. ఇప్పటికే శ్యామ్యూల్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. త్వరలోనే విచారించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X