నేనే పెద్ద డాన్.. చేతికి మట్టి అంటకుండా.. లవర్‌ను ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు.. రియా వీడియో వైరల్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆయన ప్రేయసి రియా చక్రవర్తి వ్యవహార తీరు, ప్రవర్తన, అనుసరించిన విధానాలు వివాదాస్పదంగా కనిపిస్తున్నాయి. ఆమె తీరుపై బాలీవుడ్ మీడియాలో అనేక కథనాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ, బీహార్ పోలీసులు వెంటాడుతున్న సమయంలో ఆమెకు సంబంధించిన ఓ వీడియో వివాదంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో తన లవర్‌పై దారుణమైన కామెంట్లు చేశారు. ఆమె ఏమన్నారంటే..

రియా చక్రవర్తిపై పలు అనుమానాలు
రియా చక్రవర్తిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కృష్ణ కిషోర్ సింగ్ పాట్నాలో కేసు నమోదు చేశారు. సుశాంత్ జీవితంలోకి జీవితంలోకి రియా ప్రవేశించిన తర్వాత నా కుమారుడి పరిస్థితి గందరగోళంగా మారింది అంటూ పలు ఆరోపణలు సంధించారు. ఈ క్రమంలో అలాంటి ఆరోపణలకు బలం చేకూరే విధంగా రియా వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.

అందరికంటే నేనే పెద్ద డాన్
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో రియా మాట్లాడుతూ.. నేను అందరికంటే పెద్ద డాన్‌ను. చిన్న గుండాలను ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు. నా బాయ్‌ఫ్రెండ్ కూడా తానో పెద్ద గ్యాంగ్‌స్టర్ అనుకొంటారు. కానీ అతని కంటే పెద్ద డాన్ అనే విషయం ఆయనకు తెలియదు అంటూ వీడియోలో మరొకరితో సంభాషిస్తూ కనిపించారు.

చేతికి మట్టి అంటకుండా
రియా చక్రవర్తి అలాగే తన సంభాషణను కొనసాగిస్తూ.. నా చేతికి మట్టి అంటించుకోను. వేర వ్యక్తులు చేతికి మట్టి అంటేలా పనులు చేస్తాను. ఉదాహరణకు నిర్మాత వద్దకు వెళ్లి మూముళ్లు వసూలు చేసుకు రమ్మని పంపను. వాళ్లు తామే డాన్ అని ఊహల్లో బతికేస్తుంటారు. కానీ వాళ్లు మరొకరి కోసం పనిచేస్తారనే విషయం వాళ్లకు తెలియదు అంటూ వీర లెవల్లో వీడియోలో మాట్లాడుతూ కనిపించారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్
అయితే ఆ వీడియో చివర్లో తన సంభాషణను రికార్డు చేయవద్దని ఎదుటి వ్యక్తిని కోరింది. రియాకు సంబంధించిన వీడియోను బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ వార్త పత్రిక వెబ్‌సైట్లో వచ్చింది. అనంతరం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఆ వీడియో వివాదాస్పదంగా మారుతున్న సమయంలో రియా టీమ్ స్పందించింది.
Recommended Video

రియా టీమ్ క్లారిటీ
అయితే ఆ వీడియో వివాదాస్పదం అవుతున్న సమయంలో రియా లీగల్ టీమ్ స్పందించింది. నల్లటి డ్రెస్‌లో రియా ఉన్న వీడియో వైరల్ కావడం మా దృష్టికి వచ్చింది. అది స్టాండప్ కామెడీ కోసం చేసిన వీడియో. అప్పుడప్పుడు కామెడీ వీడియోలు చేస్తుంటాను. తాయ్ అనే ఓ క్యారెక్టర్‌ను అప్పడప్పుడు ప్లే చేస్తుంటాను అని రియా చెప్పినట్టు ఓ ప్రకటనను విడుదల చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications











