డబ్బుంది, ఎపైర్లు ఉన్నాయి, కానీ సింగిలే(ఫోటోలు)
హైదరాబాద్: ఈ మధ్య చాలా మంది సినిమా తారలు డబ్బు సంపాదించమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వయసు మీద పడుతున్నా పెళ్లి పెటాకులు లేకుండా కెరీర్ లక్ష్యంగా దూసుకెలుతున్నారు. ఫలితంగా వారు బ్యాంకు బ్యాలెన్స్ బాగా పెంచుకుంటున్నారే తప్ప....తమ జీవితానికి సరైన జోడీని మాత్రం సంపాదించుకోలేకపోతున్నారు. అయితే పెళ్లి చేసుకోక పోయినా...ఎఫైర్లతో కాలం సాగిస్తున్నారు.
బాలీవుడ్లో ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు. కేవలం హీరోలు మాత్రమే కాదు...కొందరు స్టార్ హీరోయిన్లు కూడా ధనార్జనే లక్ష్యంగా ఉన్నారే తప్ప... పెళ్లి గురించి, సంసార జీవితం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో వీరిపై విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. వయసు మీద ఉన్నప్పుడు తీర్చుకోవాల్సిన ముచ్చట తీర్చుకోకుండా....డబ్బు సంపాదించుకని ఏం చేస్తారు? అని సగటు జనాలు అభిప్రాయ పడుతున్నారు.
డబ్బు సంపాదనే లక్ష్యంగా ముందుకు సాగుతూ....తమ జీవితానికి సరైన తోడు వెతుక్కోలేనంత బిబీబిజీగా గడుపుతున్న కొందరు సినీ సెలబ్రిటీలపై ఓ లుక్కేద్దాం....

ప్రియాంక చోప్రా
మాజీ మిస్ వరల్డ్ అయిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా....బాగా డబ్బున్న సెలబ్రిటీలలో ఒకరు. ఇతర బాలీవుడ్ బ్యూటీలకు ఎవరికీ లేని రోల్స్ రాయిస్ లాంటి ఖరీదైన కారును కూడా కలిగి ఉంది. ఇప్పటి వరకు ఆమెకు ఎంతో మంది స్టార్లతో ఎపైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆమె తన జీవితానికి తగిన జోడీని వెతుక్కోలేకపోయింది.

సల్మాన్ ఖాన్
బాలీవుడ్లో బాగా డబ్బున్న హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన సల్మాన్ ఖాన్....వయసు పరంగా బాగా ముదిరి పోతున్నా ఇప్పటి వరకు సరైన జోడీని వెతుక్కోలేక పోయాడు.

కత్రినా కైఫ్
బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ అండ్ రిచ్చెస్ట్ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. ఈమె కూడా ఎంతో మందితో ఎఫైర్లు నడిపింది. అయితే ఇప్పటికీ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు.

దీపిక పదుకోన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తర్వాత దీపిక పదుకోన్ కూడా బాగానే సంపాదించింది. చాలా మంది కుర్ర హీరోలతో ప్రేమాయణాలు నడిపింది. అయితే తన జీవితానికి పర్ ఫెక్టు జోడీని మాత్రం ఎంచుకోలేక పోయింది.

రణవీర్ కపూఱ్
బాలీవుడ్ స్టార్ హీరోల్లో రణబీర్ కపూర్ కూడా ఒకరు. బాగా డబ్బున్న హీరో. హీరోయిన్లను మారుస్తూ ఎఫైర్లు నడపడంలో దిట్ట. ప్రస్తుతం కత్రినా కైఫ్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడు. మరి వీరి ఎఫైర్ పెళ్లి వరకు వెలుతుందో లేదో చూడాలి.

సోనమ్ కపూర్
బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్లలో సోనమ్ కపూర్ ఒకరూ. సినిమాలు, ఎండార్సమెంట్లతో బాగానే సంపాదిస్తోంది. అయితే అమ్మడుకి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం మాత్రం లేదట.

ఏక్తా కపూర్
బాలీవుడ్లో బాగా డబ్బున్న సెలబ్రిటీలలో ఏక్తా కపూర్ ఒకరు. ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్. అమ్ముడు వయసు పైబడుతున్నా సరైన జోడీని మాత్రం ఎంచుకోలేక పోయింది.

షాహిద్ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోల్లో షాహిద్ కపూర్ ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపాడు. అయితే ఇప్పటికీ ఇంకా సింగిల్ గానే ఉన్నాడు.

అనుష్క శర్మ
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అనుష్క శర్మ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెలుతూ బాగానే సంపాదిస్తోంది. అయితే ఇప్పటికీ అమ్మడు సింగిల్ గానే జీవితం సాగిస్తోంది.


Click it and Unblock the Notifications











