షకీలా అప్పట్లోనే పవర్‌లో ఉన్న వ్యక్తిని ఎదిరించింది.. డర్టీ పిక్చర్‌తో పోలిక.. రిచా చద్దా!

అడల్ట్ చిత్రాల నటిగా షకీలా 90వ దశకంలో ఆడియన్స్ ని ఒక ఊపు ఊపింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బియోపిక్స్ ట్రెండ్ నడుస్తుండడంతో షకీలా బయోపిక్ కూడా తెరకెక్కిస్తున్నారు. హాట్ బ్యూటీ రిచా చద్దా షకీలా పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి 'షకీలా నాట్ ఎ పోర్న్ స్టార్' అనేది టైటిల్. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో రిచా చద్దా షకీలా బయోపిక్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

చాలా సన్నగా ఉన్నావు

చాలా సన్నగా ఉన్నావు

ఈ చిత్రం గురించి రిచా మాట్లాడుతూ.. షకీలా బయోపిక్ చిత్రానికి నన్ను ఎంపిక చేయగానే షకీలని వెళ్లి కలిశాను. ఆమె నన్ను చూడగానే నువ్వు చాలా సన్నగా ఉన్నావు.. ఒంటిమీద కండ కూడా లేదు అని కామెంట్ చేశారట. దీనితో తాను ఐదు కేజీల బరువు పెరిగినట్లు రిచా చద్దా తెలిపింది. చిప్స్, వేపుళ్ళు లాంటి ఆహార పదార్థాలు తిని బాగా లావైనట్లు రిచా తెలిపింది.

ఆమె ధైర్యం గురించి తెలుసుకుని

ఆమె ధైర్యం గురించి తెలుసుకుని

షకీలా పాత్రలో నటించడం సులభమైన విషయం కాదని రిచా చద్దా తెలిపింది. అనేక వేరియేషన్స్ చూపించాలి. షకీలా తన జీవితంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఎంతో ధైర్యాన్ని కూడా ప్రదర్శించారు. 90వ దశకంలోనే అధికారంలో ఉన్న వ్యక్తిని ఎదిరించడం సామాన్యమైన విషయం కాదు. అందుకే తాను ఈ చిత్రానికి ఒప్పుకున్నట్లు రిచా చద్దా తెలిపింది.

అశ్లీలత గురించి

అశ్లీలత గురించి

షకీలా బయోపిక్ చిత్రంలో అశ్లీలత ఎక్కువగా ఉంటుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కానీ ఇది అద్భుతమైన చిత్రం అని రిచా తెలిపింది. షకీలా జీవితంలో సినిమాలు మాత్రమే కాదు.. మనుషులపై ఆమెకు ఉన్న నమ్మకం, ఆపదలో ఉన్నారని చెప్పగానే ఆరా తీయకుండాసాయం చేసే గుణం లాంటి అంశాలన్నింటినీ ఈ చిత్రంలో చూపించినట్లు రిచా తెలిపింది.

Recommended Video

Shakeela Biopic: Richa Chadha To Shake Her Belly In Shakeela Biopic
డర్టీ పిక్చర్‌తో పోలిక

డర్టీ పిక్చర్‌తో పోలిక

ఈ చిత్రానికి డర్టీ పిక్చర్ తో వస్తున్న పోలికల గురించి కూడా రిచా స్పందించింది. షకీలా బయోపిక్ కు, డర్టీ పిక్చర్ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఈ చిత్రంలో సిల్క్ స్మిత కు సంబందించిన కొన్ని సన్నివేశాలు కూడా చూపించాం అని రిచా చద్దా తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X