హీరోయిన్ వెంటపబడ్డ మృగాళ్లు, వార్నింగ్...
హైదరాబాద్: ఈ మధ్య మహిళలపై దేశంలో మృగాళ్ల ఆగడాలు పెరిగి పోతున్నాయి. ఈ పరిస్థితి సాధారణ మహిళలకు మాత్రమే కాదు....సినిమా సెలబ్రిటీలకూ తప్పడం లేదు. తాజాగా బాలీవుడ్ తార రీచా చద్దాకు కొందరు ఆకతాయిల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఆమె మౌనంగా ఉండకుండా ఆకతాయిలను తనదైన రీతిలో హెచ్చరించి తెగువ ప్రదర్శించింది.

ఇటీవల తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో ఇద్దరు ఆకతాయిలు ఆమె వెంటపడ్డారు. అంతటితో ఆగకుండా అసభ్యకర కామెంట్స్ చేసారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రీచా చద్దా వారికి వార్నింగ్ ఇచ్చి తగిన గుణపాఠం చెప్పింది. ఇలాంటి సంఘటనలు ఎదురైనపుడు మహిళలు ఎవరూ చూస్తూ ఊరుకోకూడదని, ధీటుగా ఎదుర్కోవాలని సలహా ఇస్తోంది.
రిచా చద్దా సినిమాల లైఫ్ గురించిన వివరాల్లోకి వెళితే...అమృత్‌సర్‌కు చెందిన ఈ భామ....మోడలింగ్ రంగం నుండి బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అయితే ఆమెకు ఇక్కడ సరైన అవకాశాలు దక్కడం లేదనే చెప్పాలి. కొన్ని చిత్రాల్లో అడపా దడపా చిన్న పాత్రలు తప్ప పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయితే...మెడల్‌గా మాత్రం అమ్మడు బిజీ బిజీగా గుడుపుతోంది. ఫ్యాషన్ షోలు, యాడ్స్, ఫోటో షూట్స్, పెటా కాంపెయినింగ్ లాంటి వాటికి పని చేస్తూ సెలబ్రిటీగా వెలుగొందుతోంది.


Click it and Unblock the Notifications











