»   » ఆకులు కప్పుకుని హీరోయిన్ సెక్సీ ఫోజు (ఫోటోలు)

ఆకులు కప్పుకుని హీరోయిన్ సెక్సీ ఫోజు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : 'పెటా' పేరు వినగానే అందమైన భామలు హాట్ అండ్ సెక్సీ అందాల ఆరబోతతో పెట్రేగిపోవడం ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో చూసాం. అయితే ఈ అందాల ప్రదర్శన వెనక ఒక మంచి ఉద్దేశ్యం ఉండటంతో 'పెటా' సంస్థ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయింది.

'పెటా'(PETA) సంస్థ గురించి కొత్తగా పరిచయం అక్కరలేదనుకుంటా. జంతుల హక్కుల కోసం పోరాడే ఈ అంతర్జాతీయ సంస్థకు చాలా మంది సెలబ్రిటీలు తమదైన రీతిలో ప్రచారం చేస్తుంటారు. జంతువులను హింసించ కూడదని, వాటిని చంపి తినకూడదని, మనషి స్వార్థం కోసం వాటిని వాడు కోకూడదని, అవి కూడా మన తోటి జీవులే... మనలాగే వాటికీ జీవించే హక్కు ఉంది, వాటిని ప్రేమించండి, శాఖా హారులుగా మారండి అనేది ఈ సంస్థ సిద్ధాంతం.

తాజాగా 'పెటా' కోసం అందాలు ఆరబోసిన భామల లిస్టులో ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ రీచా చద్దా కూడా చేరింది. మాసం తినడం మానేయండి శాఖాహారులుగా మారండి అంటూ ఇలా ఒంటిపై ఆకులు మాత్రమే పెటా యాడ్ కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

శాఖాహారం తినమంటోంది

శాఖాహారం తినమంటోంది

మనిషి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే శాఖాహారం తినడమే మేలని, మాంసాహారం తినేవారికంటే శాఖాహారం తినే వారు కనీసం 10 సంవత్సరాల ఎక్కువ జీవిస్తారని రీచా చద్దా ప్రచారం చేస్తోంది.

రీచా చద్దా

రీచా చద్దా

అమృత్ సర్‌లో పుట్టి, ఢిల్లీలో పెరిగిన రీచా చద్దా మోడలింగు వైపు ఆకర్షితురాలైంది. మోడలింగు రంగంలో అడుగు పెట్టాక తన ప్రయాణం సినిమా రంగం వైపు కొనసాగించింది.

సినిమా రంగంలో...

సినిమా రంగంలో...

2008లో ‘ఓయె లక్కీ లక్కీ ఓయె' అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. అనంతరం పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల వచ్చిన ‘రామ్ లీలా' చిత్రంలో దీపిక పదకొనె వదిన పాత్రలో నటించింది.

రీచా చద్దా

రీచా చద్దా

రీచా చద్దా ఇదంతా చేస్తోంది నిజంగా జంతువులపై ప్రేమతోనేనా...? లేక పబ్లిసిటీ ఆర్భాటమా? అని ప్రశ్నించే వారూ ఉన్నారు.

English summary
Bollywood girl Richa Chadda has become the latest Bollywood actress to be associated with People for the Ethical Treatment of Animals (PETA).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu