మద్యంలో మునిగి తేలుతున్న షకీలా.. అందాలతో రెచ్చగొట్టేలా బాలీవుడ్ బ్యూటీ!
వెండి తెరపై ఈ ఏడాది బియోపిక్స్ పరంపర కొనసాగబోతోంది. సినీ రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్రలు బయోపిక్స్ రూపాల్లో రాబోతున్నాడు. సౌత్ ఇండియాని 90వ దశకంలో ఒక ఊపు ఊపిన శృంగార తార షకీలా జీవితంపై కూడా బయోపిక్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంద్రజిత్ లంకేశ్ దర్శకుడు. షకీలా బిగ్రేడ్ చిత్రాలతో పాపులర్ అయింది. ఆ తరువాత సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంది. సినిమాల్లోకి రాకముందు, బిగ్రేడ్ నటిగా ఉన్న సమయంలో షకీలా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనే కోణంలో దర్శకుడు ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు.

షకీలగా రిచా చద్దా
బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్దా ఈ చిత్రంలో షకీలాకు పాత్రని పోషిస్తోంది. షకీలా.. నాట్ ఎ పోర్న్ స్టార్ అనేది ఈ చిత్ర టైటిల్. 90 దశకంలో యువతలో గుర్తింపు తెచ్చుకున్న షకీలా బయోపిక్ పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. షకీలా పాత్రలో నటించేందుకు రిచా చద్దా చాలా కసరత్తే చేసింది. 90లలో షకీల లాగా కనిపించేందుకు కాస్త బరువు కూడా పెరిగింది.

ఎన్ని విమర్శలు ఎదురైనా
గత ఏడాది విడుదల చేసిన షకీలా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్ని విమర్శలు ఎదురైనా తాను చెలనుకున్న పని షకీలా చేసిందనే విధంగా ఫస్ట్ లుక్ ని రూపొందించారు. వెనుక షకీలపై వస్తున్న విమర్శల చూపించారు. కానీ షకీలా మాత్రం ఒళ్ళంతా బంగారంతో కనిపించింది. ఈ ఫస్ట్ లుక్ లో రిచా చద్దా గ్లామరస్ గా కనిపించింది.

మధ్యంలో మునిగి తేలుతూ
తాజగా చిత్ర యూనిట్ మరో పోస్టర్ ని విడుదుల చేసింది. మద్యం గ్లాసులో మునిగితేలుతూ వయ్యారాలు పోతున్న రిచా చద్దా హాట్ లుక్ లో అదరగొడుతోంది. ఈచిత్రంలో బోల్డ్ సన్నివేవాలు కోకొల్లలుగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వేసవికి షకీలా బయోపిక్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చిత్ర దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ మాట్లాడుతూ చాలా రోజులగా తాను షకీలా బయోపిక్ తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

నిజమైన కథ
షకీలా జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలతో ఆమె రియల్ లైఫ్ ని ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు ఇంద్రజిత్ లంకేశ్ తెలిపారు. సినిమాల్లోకి వచ్చి సంచలనంగా మారక ముందు షకీలా ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలు కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాం అని తెలిపాడు. ఇక రిచా చద్దా కూడా ఈ చిత్రంలో నటించే ముందుకు షకీలని ఆమె సలహాలు తీసుకుంది.


Click it and Unblock the Notifications











