మతి పోగొట్టేలా 'షకీలా' ఫస్ట్ లుక్.. ఒంటిమీద కేవలం అవి మాత్రమే!
Recommended Video

శృంగార తారగా 1990 దశకంలో గుర్తింపు పొందిన షకీలా జీవిత చరిత్రని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. షకీలా బయోపిక్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్ద టైటిల్ రోల్ పోషిస్తోంది. షకీలా పాత్రలో నటించడం సాహసోపేతమైన నిర్ణయమే. కానీ ఈ అవాకాశం రాగానే రిచా చద్దా వెంటనే ఒకే చెప్పేసింది. షకీలా జీవితంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో ఎలాంటి అంశాలు చూపిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.
మతి పోగొట్టేలా ఫస్ట్ లుక్
షకీలా జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి షకీలా నాట్ ఎ పోర్న్ స్టార్ అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. షకీలా పాత్రలో రిచా చద్దా గ్లామర్ ఒలకబోసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ లో మతిపోగోట్టే అందంతో రిచా కనిపిస్తోంది. షకీలా ఇమేజ్ కు తగ్గట్లుగానే రిచా బోల్డ్ గా ఉన్న లుక్ లో ఫస్ట్ లుక్ డిజైన్ చేసారు. రిచా ఒంటిపై బంగారు ఆభరణాలు తప్ప నూలుపోగు కనిపించడం లేదు.

నాట్ ఎ పోర్న్ స్టార్
షకీలా 90వ దశకంలో ఆమెకు వచ్చిన అవకాశాలు మేరకు బి గ్రేడ్ చిత్రాల్లో నటించింది. దీనితో షకీలా పోర్ట్ స్టార్ అంటూ ముద్ర వేశారు. ఈ చిత్రానికి నాట్ ఎ పోర్న్ స్టార్ అనేది ఉపశీర్షిక. అంటే ఈ చిత్రంలో షకీలా గ్లామర్ పాత్రల్లో నటించిందే కానీ పోర్న్ స్టార్ కాదనే విషయాన్ని స్పష్టం చేయనున్నారు.

షకీలా పాత్ర కోసం
ఈ చిత్రంలో అవకాశం రాగానే రిచా చద్దా షకీలని కలసి తాన్ జీవితం గురించి తెలుసుకుంది. ఆ సమయంలో నువ్వు చాలా సన్నగా ఉన్నావు అని షకీలా రిచాతో అందట. దీనితో రిచా చద్దా దాదాపు 5 కేజీలు బరువు పెరిగినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. షూటింగ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ సాధారణ బరువుకు చేరుకుంది.

సమ్మర్‌లో విడుదల
షకీలా బయోపిక్ చిత్రాన్ని 2019 సమ్మర్ లో విడుదుల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇంద్రజిత్ లంకేశ్ ఈ చిత్రానికి దర్శకుడు. షకీలా బిగ్రేడ్ చిత్రాల్లోనే కాక చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. షకీలా జీవితానికి సంబంధించిన వివాదాస్పద సంఘటనలు ఈ చిత్రంలో చూపిస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











