షకీలా బయోపిక్ ఫస్ట్‌లుక్ కేక.. ఒంటిపై నూలు పోగు లేకుండా.. స్టార్ హీరోలకు గుండె దడ!

ఎనభై, తొంభై దశకాల్లో దక్షిణాది చిత్ర పరిశ్రమను శృంగార భరిత చిత్రాలతో దడదడలాడించిన సెక్స్ బాంబ్ షకీలా బయోపిక్ ప్రేక్షకుల మీదకు వదలారు. షకిలా పాత్రలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా నటిస్తున్న సంగతి తెలిసిందే. షకీలా.. నాట్ ఏ పోర్న్ స్టార్ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగినట్టుగానే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కేక పెట్టించింది. వివరాల్లోకి వెళితే..

Recommended Video

Shakeela First Poster : Richa Chadha looks Very Bold

స్టార్ హీరోలకు గుండె దడ

స్టార్ హీరోలకు గుండె దడ

90వ దశకంలో తమిళ, మలయాళ చిత్రంలో షకీలా నటించింది. తేజ రూపొందించిన నువ్వు నేను చిత్రంలో, అలాగే తమిళ్‌లో విక్రమ్ నటించిన ధూల్ చిత్రంలో, అలాగే విజయ్ నటించిన అళగియ తమిజ్ మగన్ అనే చిత్రాల్లో నటించింది. మలయాళంలో షకీలా సినిమా రిలీజ్ అవుతున్నదంటే స్టార్ హీరోలు సినిమాలు వాయిదా వేసుకొన్న సంగతి తెలిసిందే.

నూలుపోగు లేకుండా రిచా చద్దా లుక్

నూలుపోగు లేకుండా రిచా చద్దా లుక్

అంత క్రేజ్ ఉన్న షకీలా జీవితం ఆధారంగా సినిమా వస్తున్నది. నేను శృంగార తారను కాదు అంటూ (నాట్ ఏ పోర్న్ స్టార్‌) పోస్టర్‌పై రిచా చద్దా లుక్ కేక పెట్టించింది. ఒంటిపై నూలు పోగు లేకుండా బంగారం పూత పూసినట్టు నగలతో ధగధగ మెరిసిపోయింది. షకీలా లుక్‌లో రిచా చద్దా ఇచ్చిన పోజ్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

పెద్ద పరదా కూడా చిన్నదే

పెద్ద పరదా కూడా చిన్నదే

లావైన హీరోయిన్‌కు చిన్న పెద్ద పరదా కూడా చిన్నగైపోయిందనే కామెంట్ పోస్టర్‌పై కనిపించింది. అలాగే ఇంకా ఎంత ఖాళీ ఉంది. ఇలాంటి పనులు కూడా చేస్తావా అనే డైలాగ్స్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజెప్పాయి. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌గా షూట్ చేసినట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

2019లో విడుదల

2019లో విడుదల

ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న షకీలా బయోపిక్‌కు ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2019 వేసవిలో విడుదల కానున్నది. ఈ చిత్రాన్ని కర్ణాటకలోని ఓ కుగ్రామంలో షూట్ చేశారు. ఈ చిత్రంలో స్వయంగా షకీలా అతిథి పాత్రలో కనిపించడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X