రజనీ 'లక లక లక లక' ఇప్పుడామె నోటితో...
చంద్రముఖి చిత్రం చూసిన వాళ్ళు 'లక లక లక లక' ని మర్చిపోవటం చాలా కష్టం. ఇప్పుడా 'లక లక లక లక' డైలాగుని 'లీడర్' చిత్రంతో పరిచయమైన రిచా గంగోపాధ్యాయ వల్లిస్తోంది. పి.వాసు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతోన్న చంద్రముఖి సీక్వెల్ లో ఆమె ఈ ఊతపదం వాడుతుంది. ఈ విషయాన్ని రిచానే కన్ఫర్మ్ చేసింది. ట్విట్టర్ లో ఈ విషయమై కామెంట్ చేస్తూ..'చంద్రముఖి-2' లో నా పాత్రకు భారీ డైలాగ్ లు ఉన్నాయి. బట్టీ పట్టి చెప్పేస్తున్నాను. లక లక లక అని ఈ చిత్రంలో డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఎవర్నయినా ఆట పట్టించాలనుకుంటే నేను లక లక లక అని ఏడిపిస్తున్నాను' అని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
అలాగే 'చంద్రముఖి-2' షూటింగ్ వివరాలు తెలియచేస్తూ..."గుడ్ మార్నింగ్..అందరూ ఎలా ఉన్నారు. నేను చాలా హ్యాపీగా షూటింగ్ చేస్తున్నాను. వెంకటేష్ గారు, దర్శకుడు వాసు గారు, శ్రద్ధాదాస్...మొత్తం మా టీమ్ అంతా ఎంతో సరదాగా షూటింగ్ చేస్తున్నాం. ఎండలు మాత్రం మండిపోతున్నాయ్. కానీ భరించక తప్పదు కదా. ఇంత ఎండలో కూడా నాకు ఆనందం కలుగుతున్న విషయం ఈ చిత్రం షూటింగ్. రెండు రోజుల క్రితం నా మీద ఒక అద్భుతమైన సన్నివేశం తీశారు. ఆ సీన్‌లో నేను బాగా యాక్ట్ చేశానని అనుకుంటున్నాను. సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పాలి అంటోంది. ఇదో రకమైన పబ్లిసిటీ అని మిగతా వాళ్ళు ఇదిచదవి కామెంట్స్ చేసుకుంటున్నారు. మొత్తానికి రజనీ 'లక లక లక లక' ఇలా వర్కవుట్ అవుతోందన్నమాట.


Click it and Unblock the Notifications











