ఆమెకే మళ్లీ 'సారొస్తారా'లో రవితేజ ఛాన్స్
రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం 'సారొస్తారా'. పరశురామ్ (బుజ్జి) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ కథలో మరో హీరోయిన్ కూ చోటుంది. ఆ స్థానం రిచాకే ఖరారు చేసినట్లు సమాచారం.
'మిరపకాయ్' సినిమాలో రవితేజ, రిచా గంగోపాధ్యాయ జంటగా కనిపించారు. ఆ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఇప్పుడు వీరిద్దరినీ మరోసారి జంటగా చూపెడితే బిజినెస్ పరంగా క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈనెల 16 నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు నిమిత్తం రవితేజ రెమ్యునేషన్ తీసుకోకుండా కేవలం షేర్ మాత్రం తీసుకునేటట్లు ఎగ్రీ అయ్య శక్తి ప్లాప్ తో లాస్ లో ఉన్న నిర్మాతకు భారం తగ్గించాడని తెలుస్తోంది. అలాగే దర్శకుడు పరుశరామ్ కి సైతం రెమ్యునేషన్ ని సినిమా పూర్తయ్యి అమ్ముడయ్యాక తీసుకునేడట్లు ఎగ్రిమెంట్ చేయించాడని చెప్పుకుంటున్నారు. అలా ఓ పెద్ద నిర్మాతను రవితేజ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
ఇక శక్తి ప్లాప్ అయ్యాక అశ్వనీదత్ తో ఎన్టీఆర్ మళ్లీ చేస్తాడని వినపడింది. అయితే అది కార్య రూపం దాల్చలేదు. ఆయన మరో ఇద్దరు హీరోలను అడిగినా వారు డేట్స్ లేవని తప్పించుకోవటంతో రవితేజ ముందుకొచ్చాడంటున్నారు. రవితేజ చిత్రం అంటే మినిమం గ్యారెంటీ చిత్రం అవుతుందనే నమ్మకంతో చేస్తున్నారు. అందులోనూ గతంలో రవితేజ, పరుశరామ్ కాంబినేషన్ లో ఆంజనేయులు చిత్రం వచ్చింది. ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ యాక్షన్ ఎంటర్టనర్ చేస్తున్నట్లు వినికిడి. ఇక రవితేజ ప్రస్తుతం చేసిన దరువు చిత్రం రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











