'నాకేం తక్కువ?' అంటున్న రిచా గంగోపాధ్యాయ
అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వున్నట్టు... కథానాయిక రిచాగంగోపాధ్యాయకు కూడా అందం, అభినయం అన్నీ వున్నాయి కానీ, అవకాశాలే లేవు. తనూ అదే ఫీలవుతోందిప్పుడు. 'ఇప్పుడున్న ఇతర హీరోయిన్లతో కంపేర్ చేసుకుంటే ఏ విషయంలోనూ వాళ్లకి నేను తక్కువ కాను. కానీ, అవకాశాలు మాత్రం రావడం లేదు. బహుశా... నాకింకా ఇక్కడ టైం రాలేదేమో' అంటోంది రిచా.
'ఒక సినిమా హిట్ అయితే, ఆ క్రెడిట్ అంతా హీరోకీ, దర్శకుడికీ... అలా అలా పంచేసుకుంటారు. హీరోయిన్ కి ఏమాత్రం క్రెడిట్ వుండదు. అదే ఫ్లాప్ అయిందనుకోండి... ఆ తప్పంతా హీరోయిన్ కే అంటగడతారు. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే చాలు... ఇక ఐరెన్ లెగ్ బ్రాండ్ వేసేస్తారు' అంటూ వర్రీ అవుతోంది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలలో నటిస్తున్న రిచా... తెలుగులో మంచి ఆఫర్లు వస్తాయని ఆశగా వుంది.


Click it and Unblock the Notifications











