రవితేజ సంగతి మొదటిరోజే తెలిసింది: రిచా గంగోపాధ్యాయ
రవితేజ చాలా సరదా మనిషి అని అందరూ చెప్పుకొంటుంటే విన్నాను. ఎంత సరదాగా ఉంటారో మొదటి రోజే తెలిసింది. దాంతో ప్రతీరోజూ నేనేదో షూటింగ్‌కి వెళ్తున్నాను.. అని ఎప్పుడూ ఫీలవలేదు. కూల్ గా షూటింగ్ మొత్తం జరిగిపోయింది. సినిమా పూర్తయిపోయింది అని తెలియగానే బాధ కలిగింది. అంతగా ప్రతి నిమిషం ఆస్వాదించానంటే అదంతా రవితేజ వల్లే అంటూ చెప్పుకొచ్చింది రిచా గంగోపాధ్యాయ. ఆమె తాజా చిత్రం మిరపకాయ్. అందులో ఆమె వినమ్ర పాత్ర చేసింది. ఆ పాత్ర ప్రకారం లంగా,ఓణి కట్టుకుని,అమాయకమైన చూపులతో ఆకట్టుకుంది. అలాగే తనకు ఆ పాత్ర ఎలా వచ్చిందో చెపుతూ...దర్శకుడు హరీష్ శంకర్ వినమ్ర పాత్ర నా కోసమే రాసుకొన్నారు. అయితే 'లీడర్' పంక్షన్ లో నన్ను చూసి 'అమెరికా అమ్మాయివి కదా. లంగావోణీ పాత్ర నీకు నప్పదేమో. వైశాలిగా చేయ్' అన్నారు. కానీ నాకు వినమ్ర పాత్ర నచ్చింది. నేను ఎందుకు చేయలేను...అని సవాల్‌గా తీసుకొన్నాను. అప్పటికి షూటింగ్‌కి ఇంకా సమయం ఉండడంతో నా పాత్ర తీరుతెన్నులను బాగా పరిశీలించాను అందుకే క్లిక్కయింది అంటోంది.


Click it and Unblock the Notifications











