రాజమౌళిని లీడర్ భామ సాటిస్ ఫై చేస్తుందా..!?
అటు రాజమౌళి 'ఈగ" ఇటు ప్రభాస్ 'రెబల్" పూర్తయిన వెంటనే వీరిద్దరి కలయికలో భారీ చిత్రం షూటింగ్ మొదలవనుంది. ఇది జరగాలంటే సుమారుగా సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. మరి ఇంతటి శక్తివంతమైన చిత్రంలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఇంకా సస్పెన్సు మాత్రం వీడలేదు. ముందుగా కాజల్ పేరు వినబడినా ప్రభాస్ పక్కన రెగ్యులర్ గా కనపడే అమ్మాయి కాక కొంత స్పెషాలిటీ కావాలని రాజమౌళి కోరుకుంటున్నాడు. అందుకే 'లీడర్" భామ రిచా గంగోపాద్యాయ అయితే రెబల్ స్టార్ ఫిజిక్ కి సరిసాటిగా వుంటుందని ఫిలింనగర్ టాక్. అనుకున్నదే తడువుగా రిచా ప్రభాస్ ని పటాయించేసినా ఈ భారీ అందాల సుందరి విషయంలో రాజమౌళి ఎంతవరకు సాటిస్ ఫై అవుతాడో అన్నది అసలు పాయింట్...


Click it and Unblock the Notifications











