ఆ సినిమా చూసి రీచా ఏడుపు...!
మిరపకాయ్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ ఓ సినిమా చూసి ఒకటే ఏడుపు. ఆ సనిమా చూసినా ప్రతిసారీ ఆమె కంటి వెంట నీళ్లు వస్తూనే ఉంటాయి. అది జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన దిగ్రేట్ ఫిల్మ్ టైటానిక్. ఈ సినిమా అంటే రీచాకు చాలా ఇష్టమట.
ఈ విషయం గురించి రీచా తన ట్విట్టర్లో పేర్కొంటూ....నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆమె 11 సార్లు ఆ సినిమా సానని, ఆ సినిమా చూసిన ప్రతిసారీ తనకు ఏడుపు ఆగదని, సినిమా అని తెలిసినా ఎన్నోసార్లు చూసినదే అయినా మళ్ళీ కొత్తగా చూసినట్టు ఉంటుంది. అందుకే ఇప్పటికీ టీవీలో వస్తే అదే పనిగా కూర్చుని చూస్తాను అంటూ తెలిపింది.
రీచా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'వారధి' చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అదే విధంగా రవితేజ హీరోగా రూపొందుతున్న 'సార్ వచ్చారు' చిత్రంలో...నాగార్జున సరసన 'భాయ్' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
లీడర్ చిత్రం ద్వారా టాలీవుడ్ తెరంగ్రేటం చేసిన రీచాకు ఆ చిత్రం పెద్దగా పేరు తేలేదు. రవితేజ మిరపకాయ్ చిత్రం అమ్మడుకి గ్లామర్ బేబీ ఇమేజ్ తెచ్చినా....సోలో హీరోయిన్ అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు పాపం...!


Click it and Unblock the Notifications











