లీడర్ భామ కథ కాదు, కల కంచికేనా.....!?
కొంత మందికి భారీ విజయం లభించినా అది వారి కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడదు. అలాగే చెప్పుకోదగ్గ అవకాశాలని కూడా అందించదు. ప్రస్తుతం ఈ పరిస్థితిని రిచా గంగోపాధ్యాయకు ఎదురయింది. రాణాతో శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఢిల్లీ భామ రిచాగంగోపాధ్యాయకు రవితేజ కథానాయకుడిగా హరీష్ శంకర్ తెరకెక్కించిన 'మిరపకాయ్" బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ విజయాన్ని నమోదుచేసుకున్నా పెద్దగా ఫలితం లేకుండా పోయింది.
'మిరపకాయ్" భారీ విజయాన్ని సాధించినా రిచాకు తెలుగులో ఒక్క అవకాశం కూడా రాకపోవడం గమనార్హం. దీంతో కొంత నిరాశపడ్డ రిచాకు తమిళంలో ధనుష్ తో నటించే అవకాశం లభించింది. ఈ చిత్రంతో పాటు బాలీవుడ్ లో విజయవంతమైన 'దబాంగ్" చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న 'ఓస్తీ"లో శింబుకు జోడీగా నటిస్తోంది. ఇక ధనుష్ కథానాయకుడిగా సెల్వరాఘవన్ రూపొందిస్తున్న 'మయాక్కమ్ ఎన్నా" చిత్రం తెలుగులో అనువదిస్తే ఈ చిత్రం ద్వారా తెలుగులో మళ్ళీ పాగా వేయాలని భావించింది రిచా.
అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేయకుండా రీమేక్ చేయబోతున్నానని దర్శకుడు సెల్వరాఘవన్ తెలియజేశాడు. దీంతో 'మయాక్కమ్ ఎన్నా" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువ కావాలనుకున్న రిచాగంగోపాధ్యాయ కల కంచికి చేరినట్టయింది. మరి తెలుగు చిత్రాల్లో అవకాశాలు పొందాలన్న కోరిక రిచా గంగోపాద్యాయకు ఎప్పుడు తీరేనో.


Click it and Unblock the Notifications











