రాజమౌళి చెయ్యి పడితే ఎవరి దశ అయినా తిరగాల్సిందే...!?
నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న హీరో సినిమాలో నటించినా దక్కని ఆనందం, రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే హీరోయిన్లు ఆ ఆనందాన్ని పొందుతున్నారు. మగధీరకి ముందు కనీసం స్టార్ హీరోల సరసన కూడా నటించలేకపోయిన కాజల్, ఇప్పుడు అందరు స్టార్ హీరోలకి కావల్సిన నటిగా మారిందంటే అది రాజమౌళి చలవే. దాదాపుగా అంతా మర్చిపోయిన సలోని ఇప్పుడు బాలకృష్ణ సరసన నటిస్తోందంటే అది కూడా అతని మహిమే.
అందుకే రాజమౌళి చెయ్యి పడితే ఎవరి దశ అయినా తిరుగుతుందని పరిశ్రమలో బలమైన నమ్మకముంది. అతని దృష్టిలో పడాలేగాని ఎవరి దశ అయినా తిరుగుతుందని పరిశ్రమలో బలమైన నమ్మకముంది. అతని దృష్టిలో పడాలని హీరోయిన్లు అందుకే అంతలా పరితపిస్తున్నారు. తాజాగా అతని కన్ను 'మిరపకాయ్" సుందరి రిచా గంగోపాధ్యాయపై పడింది. ప్రభాస్ తో తీసే సినిమాలతో తన దశ తిరిగిపోతుందని భావిస్తున్న రిచా అంతదాకా వేరే సినిమాలు అంగీకరించకూడదని అనుకుంటోందట. రాజమౌళి తన జీవితాన్నే మార్చేస్తాడని ప్రతి హీరోయిన్ కలలు కంటున్నారు ఇప్పుడు...


Click it and Unblock the Notifications











