ఏ వారస హీరోని ఉద్దేశించి 'మిరపకాయ' హీరోయిన్ రిచా సెటైర్స్ !?
నేను వారసత్వం అందుకొని వచ్చిన దాన్ని కాదు. ఒక్క తప్పు చేస్తే మళ్లీ మళ్లీ అవకాశం ఇవ్వరు. టాలెంట్ తోనే నెగ్గుకురావాలి. ఈ విషయాలు ముందే తెలుసు. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నా అని తేల్చి చెప్పింది రిచా గంగోపాద్యాయ. లీడర్ చిత్రంతో పరిచయమైన రిచా ఖాళీ లేకుండా నాగవల్లి, మిరపకాయి చిత్రాలలో నటించింది.తెలుగు పరిశ్రమలో పోటీ ఎక్కువ ఉంది కదా అన్న విషయానికి సమాధానంగా వరుసగా ఇలా వారస హీరోలకు చురకలు అంటేలా కామెంట్ చేసింది.అలాగే ...పరిశ్రమలోకి ఒకరి అండతో వచ్చినదాన్ని కాదు.
ఇక్కడ అడుగుపెట్టే వరకూ నాకెవ్వరూ తెలీదు. నా వెనుక ఎవరూ లేరు. ఒక్క ఆత్మవిశ్వాసం తప్ప అంది.అంతేగాక సినిమాలు చేసేయాలి అనే కంగారు లేదు. ఏదో ఓ సినిమా చేయకపోతే ప్రేక్షకులు మర్చిపోతారేమో అనే బెంగ లేదు. నాకు సరిపడే పాత్ర వచ్చే వరకూ ఎదురు చూస్తాను అని చెప్తోంది.ఇక వెంకటేష్ సరసన బాడీగార్డు రీమేక్ లో ఆమె నటించనుందనే వార్తలను వచ్చాయి.అయితే బెల్లంకొండ సురేష్ వాటిని కొట్టిపారేసారు.


Click it and Unblock the Notifications











