పవన్ కళ్యాణ్ సరసన 'లీడర్' హీరోయిన్
శేఖర్ కమ్ముల లేటెస్ట్ చిత్రం 'లీడర్' ద్వారా పరిచయమైన రిచా గంగోపాద్యాయ తాజాగా పవన్ కళ్యాణ్ ప్రక్కన హీరోయిన్ గా సెలక్టయింది. బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని జయంత్.సి.పరాంన్జీ డైరక్ట్ చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే ఇలియానా మెయిన్ హీరోయిన్ గా సెలక్టయింది. ఇక బెంగాళి భామ రిచా ఇప్పటికే రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మిరపకాయ చిత్రంలోనూ, వెంకటేష్..చంద్రముఖి సీక్వెల్ లోనూ చేస్తోంది. ఈ చిత్రానికి ఖుషీగా...అనే టైటిల్ ని అనుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ..ద్వి పాత్రలను పోషిస్తారు.
లీడర్ శేఖర్ కమ్ముల రాణా పవన్ కళ్యాణ్ లవ్ ఆజ్ కల్ జయంత్ సి పరాంన్జీ ఖుషీగా leader sekhar kammula rana pawan kalyan jayanth


Click it and Unblock the Notifications