మహేష్ తో లక్కీ ఛాన్స్ కొట్టేసిన మిరపకాయ్ హీరోయిన్...
కొంతమంది ఇలా వచ్చి అలా స్టారలై పోతుంటారు. ఒక్క సినిమా వాళ్ల కెరీర్ ని మార్చేస్తుంటుంది. అయితే, కొంతమంది కెరీర్ మాత్రం స్లోగా అందుకుంటుంది. రిచా గంగోపాద్యాయ ఈ రెండో కేటగిరీకి చెందిన హీరోయిన్. అందుకే, తను తెలుగు ఇండస్ట్రీకి వచ్చి రెండేళ్ళయినా ఆమె కెరీర్ ఇంకా గాడిలో పడలేదు. రెండేళ్ల క్రితం ఇదే మార్చి 20 న ఆమె హైదరాబాదులో అడుగుపెట్టింది. 'లీడర్" సినిమాలో బుక్ అయింది. అందులో తను పోషించిన అర్చన పాత్రకి మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత 'నాగవల్లి" లో గౌరీ క్యారెక్టర్, ఇటీవల 'మిరపకాయ్" లో వినమ్ర పాత్ర చేసింది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు మరో చిత్రానికి సైన్ చేసాడని సమాచారం. ఈ చిత్రానికి 'బుల్లెట్" అనే టైటిల్ ని ఖరారు చేసారని కూడా సమాచారం. ఈ 'బుల్లెట్" లో మహేష్ సరసన బెంగాలీ బ్యూటి రిచా గంగోపాధ్యాయ కథానాయికగా ఎంపికయ్యిందని వినికిడి. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఇంకా బయటికి రాలేదు. ప్రస్తుతం మహేష్ బాబు 'దూకుడు" చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కాకుండా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ది బిజినెస్ మ్యాన్" సినిమా ఒప్పుకున్నాడు. అలాగే మణిరత్నం దర్శకత్వంలో ఓ పీరియాడిక్ ఫిల్మ్ కూడా అంగీకరించిన విషయం తెలిసిందే..


Click it and Unblock the Notifications











