రవితేజ సరసన 'లీడర్' హీరోయిన్ ఎంపిక
రవితేజ, హరీష్ శంకర్(షాక్ డైరక్టర్) కాంబినేషన్ లో మొదలు కానున్న నూతన చిత్రంలో హీరోయిన్ గా రిచా గంగోపాధ్యాయని ఎంపిక చేసారు. శేఖర్ కమ్ముల లీడర్ చిత్రంతో పరిచయమైన ఈమె రాణా సరసన చేసింది. ఇక ఈ కొత్త చిత్రం మార్చి 25 నుంచి ప్రారంభం కానుంది. యల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ఆర్ డి రాజశేఖర్ కెమెరా అందిస్తున్న ఈ చిత్రానికి కిక్ చిత్రానికి సంగీతం అందించిన తమస్ సంగీత సారధ్యం వహిస్తున్నారు. గౌతం రాజు ఎడిటింగ్,రామ్ లక్ష్మన్ యాక్షన్ కోసం ఎంపిక జరిగింది. అలాగే లీడర్ చిత్రంలో మరో హీరోయిన్ గా చేసిన ప్రియా ఆనంద్ కూడా దిల్ రాజు నిర్మిస్తున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ సంపాదించిన సంగతి తెలిసిందే.
రవితేజ లీడర్ రిచా గంగోపాధ్యాయ ప్రియా ఆనంద్ రాణా శేఖర్ కమ్ముల హరీష్ శంకర్ రామ రామ కృష్ణ కృష్ణ రమేష్ పుప్పాల దిల్ రాజు రామ్ richa gangopadhyay dil raju rama rama krishna krishna ram laksh


Click it and Unblock the Notifications