ఈవిడ..ఆవిడను మించిపోతుందట!
'లీడర్" చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత నాగవల్లి, మిరపకాయ్ చిత్రాల్లో నటించినా పెద్దగా క్లిక్ కాలేక పోయింది రిచా. దీంతో తమిళ సినిమాలవైపు తన చూపు మళ్లించింది. ప్రస్తుతం ఆమె ధనుష్‌తో 'మయక్కమ్ ఎన్న", శింబుతో 'ఓస్తీ" చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ హిట్ చిత్రం 'దబాంగ్"కు రీమేక్‌గా రూపొందుతున్న 'ఓస్తీ" చిత్రం స్టిల్స్ ఈ మధ్యనే విడుదలయ్యాయి.
ఈ సందర్భంగా రిచా గంగోపాధ్యాయ మాట్లాడుతూ 'తమిళ్‌లో శింబుతో కలిసి నటిస్తున్న దబాంగ్ రీమేక్ చిత్రం 'ఓస్తీ" స్టిల్స్ విడుదలయ్యాయి. ఇందులో నేను 'దబాంగ్"లో నటించిన సొనాక్షీ సిన్హాని మరిపించే స్థాయిలో అందంగా వున్నానని అంతా అంటున్నారు. ఏమో..ఈ సినిమాతో సోనాక్షి కంటే మంచి పేరు నాకొస్తుందోమో...మరిన్ని అవకాశాలు దక్కుతాయేమో" అని పేర్కొంది. పరిస్థితి చూస్తుంటే రీచా ఈ సినిమాపైనే బోలెడు ఆవలు పెట్టుకున్నట్లు స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications











