రిచా గంగోపాద్యాయ 'నాగవల్లి' ట్విట్టర్ కబుర్లు...
'లీడర్' చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన రిచా గంగోపాధ్యాయ నటించిన తాజా చిత్రం 'నాగవల్లి'. 'చంద్రముఖి' లో జ్యోతిక చేసిన పాత్రను ఈ చిత్రంలో రిచా చేశారు. తను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు కాబట్టి ఈ పాత్ర చేయడం సులువైందట. ఆ విషయం గురించి రిచా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 'నా తొలి చిత్రం లీడర్ లో డాన్స్ చేయడానికి పెద్దగా స్కోప్ లభించలేదు. ఆ కొరతను కొంతవరకు 'నాగవల్లి' తీర్చింది. డాన్స్ బేస్డ్ కేరక్టర్ కావడంతో ఈ పాత్రను ఎంతో ఇష్టంగా అంగీకరించాను.
గౌరి పాత్రలో మీరు పూర్తిగా ఒదిగిపోయారని అందరూ అంటుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు. రవి తేజ సరసన ఆమె నటించిన మిరపకాయ్ త్వరలో విడుదల కానుంది. రాణా హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో కథానాయికగా రిచా గంగోపాధ్యాయ కమిట్ అయ్యారు. లీడర్ తర్వాత మళ్లీ రాణా, రిచా నటించబోతున్న చిత్రం ఇది.


Click it and Unblock the Notifications