రాణా హీరోయిన్ తో వెంకటేష్ రొమాన్స్
దగ్గుపాటి రాణా సరసన లీడర్ చిత్రం చేసి తెలుగు వారికి పరిచయమైన ముద్దుగుమ్మ రిచా గంగోపాధ్యాయ. ఆమెని తాజాగా వెంకటేష్ చిత్రంలో తీసుకున్నారు. సింహా వంటి సూపర్ హిట్ చిత్రం నిర్మించిన పరుచూరి కిరిటీ తమ యునైటెడ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. కోన వెంకట్, గోపీమేహన్ కలిసి కథ,మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి స్టోరి డిస్కషన్స్ ముగిసాయి. దర్శకుడు మెహర్ రమేష్ కూడా లొకేషన్స్ చూసి వచ్చారు. సంక్రాంతికి వెంకటేష్ నటించిన 'బాడీగార్డ్' విడుదలవుతుంది. ఆ తరవాత ఈ కొత్త చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది. అలాగే ఈ చిత్రానికి ధమన్ సంగీతం అందించనున్నారు. ఇక రిచా రీసెంట్ గా ధనుష్ సరసన తమిళంలో చేసింది. ఆ మధ్య రవితేజ సరసన మిరపకాయలో చేసిన తర్వాత తెలుగులో ఆమెకు ఆఫర్స్ ఏమీ రాలేదు.
దాంతో ఆమె తమిళంలో బిజీ అయ్యింది. దర్శకుడు మెహర్ రమేష్ విషయానికి వస్తే శక్తి వంటి డిజాస్టర్ తర్వాత చేస్తున్న చిత్రం ఇది. ఆయన చేసిన కంత్రి యావరేజ్ కాగా, భిళ్లా, శక్తిలు నిర్మాతలుకు భారీగా నష్టాలు తెచ్చిపెట్టాయి. ఈ కొత్త చిత్రం కూడా భారీ బడ్జెట్ తోనే నిర్మించనున్నట్లు తెలుస్తోంది. సస్పెన్స్ కలిగిన కామెడీతో ఈ చిత్రం నడవనుందని తెలుస్తోంది. ఈ చిత్రంపై వరస ఫ్లాపుల్లో ఉన్న వెంకటేష్ సైతం నమ్మకం పెట్టుకున్నారు. నిర్మాతలు మాత్రం తాము దూకుడు లాంటి హిట్ ను ఈ చిత్రంతో ఇస్తామనే ధీమాతో ఉన్నారు. ఈ నిర్మాతలు ప్రస్తుతం రాణాతో నా ఇష్టం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











