హీరోయిన్‌గారూ...మరీ ఇంత బరితెగింపా?(ఫోటోలు)
హైదరాబాద్: మొదటి జనరేషన్ హీరోయిన్లు కెరీర్లో ఎదిగేందుకు, పోటీ పడి అవకాశాలు దక్కించుకునేందుకు కేవలం నటనను మాత్రమే నమ్ముకునే వారు. సినిమాల తీరు మారడంతో తర్వాతి జనరేషన్ హీరోయిన్లు నటనతో పాటు గ్లామర్ పరంగా కూడా ఇతర హీరోయిలతో పోటీ పడాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఇపుడు సినిమాల్లో పరిస్థితి పూర్తిగా మారి పోయింది.
ఈ జనరేషన్లో వస్తున్న చాలా సినిమాల్లో హీరోయిన్ కేవలం సెక్సీగా అందాలు ఆరబోసే బొమ్మగా....హీరోతో రొమాంటిక్ సీన్లు పండించే రంభలు మిగిలిపోతున్నారు. దీంతో చాలా మంది భామలు తమ అందచందాలే ప్రధాన పెట్టుబడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు.
ఈ మధ్య ఏ హీరోయిన్ చూసినా ఫోటో షూట్లతో హడావుడి మొదలు పెట్టారు. అందాలన్నీ కనిపించేలా బికినీలు, తొడలు...ఎద అందాలు ఎక్స్ ఫోజ్ చేస్తూ అందరి దృష్టి తమపై పడేలా చేసుకుంటున్నారు. సాదాసీదాగా ఫోటోలకు ఫోజులు ఇస్తే ఎవరు చూస్తారు? అందుకే కొందరు హీరోయిన్లు బరితెగింపుగా ముందుకు సాగుతున్నారు. వివిధ భంగిమల్లోఅందాలు చూపిస్తూ ప్రేక్షకులను ఊరించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా అందరి హీరోయిన్లదీ ఇదే దారి.

రీచా పనయ్
హీరోయిన్ రీచా పనయ్ సినిమా అవకాశాలు రాబట్టు కోవడం కోసం సెక్సీ ఫోటో షూట్లతో తెగ హడావుడి చేస్తోంది. ఆమె హడావుడి ఏ రేంజిలో ఉందో ఈ ఫోటోలో ఆమె ఫోజు చూస్తే స్పష్టం అవుతోంది. అందాల ఆరబోత ఆకట్టుకునే విధంగా ఉండాలి కానీ..మరీ ఇలా బరితెగింపేంటి? అని చర్చించుకుంటున్నారు.

అల్లరి నరేష్ సినిమాతో..
అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘యముడికి మొగుడు' చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైన రీచా పనయ్ ఆ సినిమాలో నటన పరంగా పెద్దగా మార్కులు కొట్టేయలేక పోయింది.

మనసు మాయ చేయకె చిత్రంలో...
ప్రస్తుతం రిచా పనయ్ ‘మనసు మాయ చేయకే' అనే తెలుగు చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రిన్స్ హీరోగా పి. సురేష్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చెందిన రీచా పనయ్ మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. అలా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.

సినిమా రంగంలో...
వదమల్లి అనే మళయాల సినిమాతో హీరోయిన్ కెరీర్ ప్రారంభించిన రీచా పనయ్ ఆ తర్వాత బ్యాంకాక్ సమ్మర్, సాండ్ విచ్ అనే మరో రెండు మళయాల చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత యముడికి మొగుడు చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











