రవితేజకు మళ్లీ ఆమె అందాల ఘాటు..!
మిరపకాయ్ చిత్రంలో తన ఘాటైన అందాలతో అటు హీరో రవితేజను, ఇటు ప్రేక్షకులకు కిర్రెక్కించిన హాటీ 'రీచా గంగోపాధ్యాయ్' మళ్లీ రవితేజతో జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం రవితేజ 'సారొస్తారా' చిత్రం కోసం ఆమెను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈచిత్రంకోసం త్రిష, అమలా పాల్‌లను సంప్రదించినప్పటికీ డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడం వల్ల ఒప్పుకోలేదు. కాజల్‌ను తీసుకునే ఆలోచన ఉందనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా దర్శక నిర్మాతల కళ్లు రీచాపై పడ్డాయని తెలుస్తోంది.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ రవితేజ హీరోగా 'సారొస్తారా' చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. గతంలో రవితేజ-పరశురాం కాంబినేషన్లో 'ఆంజనేయులు' చిత్రం రూపొందింది.
ప్రస్తుతం రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'దేవుడు చేసిన మనుషులు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. రీచా గంగోపాధ్యాయ్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'వారధి' చిత్రంలో నటిస్తోంది. మరో బెంగాళీ చిత్రంలోనూ రిచా హీరోయిన్‌గా ఎంపికయింది.
ఇక రవితేజ నటించిన 'దరువు' చిత్రం నిన్న విడుదలైన యావరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దొంగల ముఠా, వీర, నిప్పు లాంటి ప్లాపుల తర్వాత 'దరువు' చిత్రం కూడా రవితేజకు నిరాశనే మిగిల్చింది.


Click it and Unblock the Notifications











