»   » పవన్, బాలయ్య, వెంకటేష్‌‌లకు నో చెప్పిన హీరోయిన్

పవన్, బాలయ్య, వెంకటేష్‌‌లకు నో చెప్పిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం దొరకడమే గొప్పగా భావిస్తుంటారు చాలా మంది హీరోయిన్లు. ఒక వేళ చేయడం ఇష్టం లేక ఆ ఆఫర్లు వదులు కోవాల్సి వచ్చినా....అలాంటి విషయాలు బయటకు చెప్పడానికి భయపడుతుంటారు. అయితే హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు బాలయ్య, వెంకటేష్ లాంటి హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చినా కావాలనే తిరస్కరించినట్లు చెబుతోంది. ఎందుకలా చేసారు అంటే...ఆయా సినిమాల్లో నన్ను సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయమన్నారు. అందుకే నిర్మొహమాటంగా నో చెప్పాను అంటోందట.

పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో రీచా గంగోపాధ్యాయ్‌కి సెకండ్ హీరోయిన్ చాన్స్ వచ్చింది. ఆమె నో చెప్పడంతో ఆ స్థానంలో ప్రణీతను తీసుకున్నారు. దీంతో పాటు బాలయ్య-బోయపాటి సినిమాతో, మంచు విష్ణు 'దూసుకెళ్తా' సినిమాలను కూడా ఇలాంటి కారణంతోనే తిసర్కరించిందట. వెంకటేష్ షాడో సినిమాలో కూడా రీచా కాదనడంతో తాప్సిని తీసుకున్నారట.

మిర్చి చిత్రం తర్వాత రీచా గంగోపాధ్యాయ్ కేవలం నాగార్జున హీరోగా రూపొందుతున్న 'భాయ్' చిత్రంలో మాత్రమే నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ పాత్రల చేసుకుంటే వెళితే తన కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగదని, అందుకే కథకు, సినిమాలో తన ప్రాతకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నాను అంటోందట.

English summary

 Richa Gangopadhyay has become extremely choosy. She has turned down many good offers including one with Balakrishna directed by Boyapati Sreenu and another with Vishnu Manchu titled 'Doosukeltha' even though the latter had quoted a fancy price to Richa,” says a source, “Richa also turned down Pawan Kalyan’s film 'Attarintiki Daredi' and then the makers roped in Pranitha. It was the same with Venkatesh’s 'Shadow' where Taapsee replaced her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu