రవితేజ చేసిన సహకారం మరవలేనంటున్న హీరోయిన్
హీరో రవితేజ సెట్లో ఉంటే చాలా సరదాగా గడిచిపోయేది. 'షాట్ రెడీ' అనగానే తన పాత్రలోకి వెంటనే లీనమైపోయేవారు. ఎన్నో సలహాలు ఆయన్నుంచి తీసుకున్నా. డాన్స్ కూడా చేసి చూపించేవారు. ఎన్నో రకాలుగా సహకరించాడు..ఆయన్ని మరవటం కష్టం అంటోంది రిచా గంగోపాధ్యాయ. తాజాగా ఆమె చేసిన మిరపకాయ్ చిత్రం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్బంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ తన షూటింగ్ అనుభవాలు గుర్తు చేసుకుంది. అలాగే...చిత్రం షూటింగ్ పూర్తయింది అనగానే..అప్పుడే అయిపోయిందా! అనే బాధకలిగిది. దర్శకుడు హరీష్ శంకర్ కు ఇది రెండో సినిమా. సీనియర్ దర్శకుడిలా టేకింగ్ చూపాడు. లీడర్ తర్వాత మరో మంచి పాత్ర లభించింది. నటనికి అవకాశమున్న పాత్ర దొరకటం అదృష్టం అంది. అలాగే రవితేజతో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని వివరించింది.
More from Filmibeat
రవితేజ మిరపకాయ్ రిచా గంగోపాధ్యాయ దీక్ష సేత్ హరీష్ శంకర్ ravi teja mirapakaya richa gangopadhyay deeksha seth harish shankar


Click it and Unblock the Notifications











