అల్లు అర్జున్‌తో రీచాకు తొలి అవకాశం
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఇద్దరు అమ్మాయిలతో'. ఈచిత్రంలో నటిస్తున్న ఇద్దరు హీరోయిన్లలో అమలా పాల్ ఇప్పటికే ఖరారు కాగా.... తాజాగా రీచా గంగోపాధ్యాయ్‌ను రెండో హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ చేసారు. ఈ చిత్రం ఈ రోజు రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభం అయింది.
లీడర్ చిత్రంతో హీరోయిన్‍గా తెరంగ్రేటం చేసిన రీచాగంగోపాధ్యాయ్..... ఇప్పటి వరకు తెలుగులో దాదాపు అరడజను సినిమాలు చేసింది. పాపం ఎన్ని సినిమాలు చేసినా రీచాగాకు రెండో హీరోయిన్ ఛాన్సే తప్ప మెయిన్ హీరోయిన్ అవకావాలు మాత్రం రావడం లేదు. బన్నీ చిత్రంలో కూడా సెకండ్ హీరోయిన్ ప్లేసుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కాగా.... అల్లు అర్జున్‌ని మాస్ లోకి చొచ్చుకువెళ్లేలా చేసిన సినిమా 'దేశ ముదురు'. పూరి జగన్నాథ్ మార్క్ ఈ చిత్రీకరణతో అందులో అల్లు అర్జున్ పూర్తిగా మాసివ్ గా, ఎనర్జిటిక్ గా కనిపించారు. మళ్లీ వీరిద్దరి కలయికలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం రూపొందుతుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
పవన్ కళ్యాణ్‌తో 'గబ్బర్ సింగ్' చేసి ప్రస్తుతం ఎన్టీఆర్ -శ్రీను వైట్ల కాంబినేషన్లో 'బాద్ షా' చిత్రాన్ని నిర్మిస్తున్న బండ్ల గణేష్ ఈచిత్రానికి నిర్మాత. పూరి చిత్రానికి తొలి సారిగా దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ రొమాంటిక్ హీరోగా ఇటు అమలాపాల్‌తో, అటు రీచా గంగోపాధ్యాయ్‌తో లవ్ స్టోరీ ఇరగదీయనున్నాడు.


Click it and Unblock the Notifications











