»   » తెలుగు సినిమా: డబ్బున్న స్టార్ల వారసులదే హవా (ఫోటోలు)

తెలుగు సినిమా: డబ్బున్న స్టార్ల వారసులదే హవా (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యువ రాజులకే రాజ్యాధికారం, వారసులే కింగ్స్. ఇదే సంస్కృతి కొనసాగుతోంది తెలుగు సినీ పరిశ్రమలో. ఇక్కడ ధనవంతులైన స్టార్ల వారుసులదే హవా. వారికి మాత్రమే స్టార్ హీరోలుగా ఎదిగేందుకు పుష్కలమైన అవకాశాలు. హిట్టు, ప్లాపు అనే తేడా లేకుండా దినదినప్రవర్థమానంగా వారి ఎదుగుదల ఉంటుంది. పరిశ్రమలో స్టార్స్‌గా ఎదిగిన పలువురు వారసత్వ హీరోలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలోని టాప్ హీరోలే అందుకు నిదర్శనం. ఈ స్టార్స్ అంతా ధనవంతమైన కుటుంబాల నుంచి వచ్చిన వారే. పైగా బలమైన సినీ బ్యాగ్రౌండ్. వీరందరూ కూడా ఒకప్పుడు హీరోలైన వారి కుమారులు, నిర్మాత పుత్రరత్నాలే కావడం గమనార్హం.

అయితే ఈ ట్రెండు కేవలం ఇప్పుడు ప్రారంభమైంది కాదు. ఈ వారసత్వ పోకడలు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున తెర్రంగేటం చేసిన 80ల్లో మొదలైందే. ఇప్పుడు వాళ్ల వారసులు కూడా అదే ఫాలో అవుతూ ఫ్యామిలీలకు ఫ్యామిలీలే సినీ పరిశ్రమలో తమ హవా కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగ చైతన్య, ఎన్టీఆర్, ప్రభాస్, నితిన్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్, అల్లరి నరేష్ అంటి వారు ఇందుకు ఉదాహరణ.

అయితే ఇక్కడ గమనించాల్సిన ఓ విషయం ఉంది. ఇక్కడ వారసత్వంలో సినిమాల్లోకి సులభంగా ఎంటరైనవారు చాలా మందే ఉన్నప్పటికీ, పోటీని తట్టుకుని విజయవంతంగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న వారు మాత్రం కొందరు మాత్రమే. ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు టాలెంటుతోనే ఈ స్థాయికి చేరుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మహేష్ బాబు ప్రముఖ తెలుగు నటుడు, సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న కృష్ణ కుమారుడు

రానా దగ్గుబాటి ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు. రానా తండ్రి సురేష్ బాబు కూడా నిర్మాతే

రామ్ చరణ్ ప్రముఖ తెలుగు హీరో, మెగాస్టార్ చిరంజీవి ఏకైక కుమారుడు


అల్లు అర్జున్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడు

ప్రస్తుత స్టార్ హీరోల్లో ఒకరైన ప్రభాస్, నిన్నటి తరం స్టార్ హీరో కృష్ణం రాజు వారసుడు. ప్రభాస్‌కు కృష్ణం రాజు పెదనాన్న అవుతాడు.

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, సీనియర్ ఎన్టీఆర్ మనవడే జూనియర్ ఎన్టీఆర్. అదే విధంగా నటుడు హరికృష్ణ తనయుడు కూడా..

అక్కినేని కుటుంబంలో మూడో తరం నటుడు నాగార్జున. ఆయన తాత నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున తెలుగు సినిమా స్టార్లే.


పవన్ కళ్యాన్ ప్రముక నటుడు, మెగాస్టార్ చిరంజీవికి, నిర్మాత నాగబాబుకి సోదరుడు


ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కుమారుడే ఈ నితిన్


వెంకటేష్ బాబు ప్రముఖ నిర్మాత రామానాయుడు తనయుడు


నాగార్జున్, తెలుగు సినిమా లెజండరీ యాక్టర్ నాగేశ్వరరావు తనయుడు


ప్రముఖ నిర్మాత, నటుడు మోహన్ బాబుకు పెద్ద కుమారుడే మంచు విష్ణు


ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు విష్ణు


మోహన్ బాబు కుమారులు మాత్రమే కాదు...ఆయన కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న కూడా సినిమా రంగంలో తన సత్తా చాటుతోంది.


తెలుగు సినిమా లెజెండ్, నందమూరి తారక రామారావు తనయుడు బాలకృష్ణ

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమాడు శిరీష్. అదే విధంగా స్టార్ హీరో అల్లు అర్జున్‌కు సోదరుడు.


ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ తనయుడే అల్లరి నరేష్.

English summary
Only a prince can be the King. The same rule works with the Telugu film industry. Star kids can only be the stars of Telugu film industry. The number of such stars are pretty high right now than ever. If you look at the current actors (Heros) of Telugu film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu