Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్‌గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బెల్లంకొండ 'రైడ్' గొడవ ఏమైంది?
బెల్లంకొండ సురేష్ తాజాగా రూపొందిస్తున్న 'రైడ్' అనే చిత్రం కోసం కథచౌర్యానికి పాల్పడ్డాడంటూ ఆ మధ్య వార్తలు గుప్పుమన్నాయి. దానికి తోడు జెమినీ కిరణ్ న్యూస్ పేపర్లలో పొల్లాదవాన్ చిత్రం రైట్స్ తమదగ్గరున్నాయని ఎవరైనా కాపీ కొడ్తే కాపీ రైట్స్ చట్టం ప్రకారం చర్య తీసుకుంటామన్నారు. దాంతో ఇది నిజమే అన్న నిర్ణయానికి పరిశ్రమలో చాలామంది వచ్చారు. ఈ విషయమై దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ పొల్లాదవాన్ సినిమాలో ఇష్టపడి కొనుక్కున్న బైక్ మిస్సైతే దానికోసం హీరో వెతుకులాట..తర్వాత పరిణామాలు మెయిన్ గా ఉంటాయి.
అదే మా రైడ్ లో అయితే బైక్ పోయే ఎపిసోడ్ కేవలం ఐదు నిముషాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అంతా ఇధ్దరి క్లోజ్ ప్రెండ్స్ మద్య ఆ బైక్ పెట్టే చిచ్చు పై కథనం నడుస్తుంది అని చెప్తున్నాడు. అలాగే ఈ చిత్రం కథను పొల్లాదవాన్ రీమేక్ తీస్తున్న సంస్ధ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావుకి వివరించానన్నారు. ఆయన విని తమ కథకీ రైడ్ కథకీ పోలిక లేదని తేల్చి చెప్పారని చెప్తున్నారు.
ఇక ధనుష్ హీరోగా తమిళంలో చేసిన పొల్లాదవాన్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. బైక్ చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. దీన్ని వరుణ్ సందేష్ హీరోగా తెలుగులో గుణ్ణం గంగరాజు కుమారుడు గుణ్ణం సందీప్ చేస్తున్నాడు. కెమెరా వర్క్ కి ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా సెకెండాఫ్ కొద్దిగా బోర్ గానూ సాగుతుంది. అయితే గుణ్ణం గంగరాజు దీన్ని గమనించి మార్చాడని వినపడుతోంది. అలాగే అలీ మీద...ఓ ప్రత్యేకమైన కామెడీ ట్రాక్ ని కూడా రూపొందించి కలుపుతున్నారని వార్త.
ఇక ఇవన్నీ ఇలా ఉంటే ఒక ఊరిలో(తరుణ్,సలోని)చిత్రాన్ని డైరక్ట్ చేసిన రమేష్ వర్మ..బెల్లంకొండ సురేష్ కి రైడ్ పేరుతో బైక్ చుట్టూ తిరిగే కథ చెప్పి ఒప్పించుకున్నారు. బైస్కిల్ థీఫ్ ఆధారంగా రూపొందిన బీజింగ్ భైస్కిల్ అనే చిత్రం ఆధారంగా ఈ కథ తిరుగుతుందని సమాచారం. అయితే ఫొల్లాదవాన్ కూడా బైస్కిల్ ధీప్ ఆధారంగా రూపొందిన చిత్రమే కావటంతో ఈ తలనొప్పి వచ్చింది. పొల్లాదవాన్ కథ ప్రకారం హీరో ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. తండ్రిని ఒప్పించుకుని ఒక పల్సర్ బండి కొనుక్కుంటాడు.
ఆ బండిని లోకల్ మాఫియా వాళ్ళు మిస్ చేస్తారు. అక్కడ నుండి ప్రాణపదంగా చూసుకుంటున్న ఆ బండికోసం వేట మొదలవుతుంది. ఆ క్రమంలో ఆ మాఫియా వాళ్ళతో తగువుఅవుతుంది. ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో కధ సాగుతుంది. ఇక బైస్కిల్ ధీప్ లో సైకిల్ మిస్సయితే దాని కోసం వెతుకులాటని ఇలా మార్చి వాళ్ళు చేసారు. దాన్ని జెమినీ వారు రైట్స్ కొన్నారు.అదీ కథ.