దిల్ రాజు 'కేరింత' తొలి పాట ఇదిగో (వీడియో)
హైదరాబాద్ : సుమంత్ అశ్విన్, తేజస్విని జంటగా నటించిన చిత్రం 'కేరింత'. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. అడవి కిరణ్ దర్శకుడు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఓ పాటని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆ పాటను మీరు ఇక్కడ చూడండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ''మా సంస్థలో 'కొత్తబంగారులోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలకు పనిచేశాడు మిక్కీ. ఆ పాటలు జనాదరణ పొందాయి. అంతకు మించిన మంచి పాటలు ఈ సినిమాకి అందించాడు మిక్కీ. ఆరు పాటలున్నాయి. ఈ పాటలన్నీ ఈ ఏడాదంతా వింటూనే ఉంటారు. పాటల్ని ఈనెల 25న విడుదల చేస్తున్నాము''అన్నారు.
''ఈ చిత్రం మొదలై రెండేళ్లయ్యింది. ఎక్కడా రాజీ పడకుండా ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వాలన్న ఆశయంతో మా బృందమంతా కష్టపడుతోంది. మేలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది''అన్నారు దర్శకుడు. ''పాటలు బాగా వచ్చాయి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఆకట్టుకొంటుంది''అని మిక్కీ తెలిపారు.
'వినాయకుడు' తో తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు సాయి కిరణ్ అడవి కొత్త చిత్రం 'కేరింత'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మై డ్రీం సినిమా బ్యానర్ ఫై దిల్ రాజు, సాయి కిరణ్ అడవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కి జే మేయర్ ను అందిస్తున్నారు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కొత్తవాళ్లు నటిస్తున్నారు. ఇందుకోసం స్టార్ హంట్ నిర్వహించారు.

సాయికిరణ్ అడవి మాట్లాడుతూ... ''ఈ కథపై ఎప్పట్నుంచో కసరత్తులు జరిపాం. అబ్బూరి రవి మాతో కలవగానే కథ కొత్తరూపం సంతరించుకొంది'' అన్నారు. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. ఎడిటర్ గా మధు, సినిమాటోగ్రాఫర్ గా విశ్వ, కొరియోగ్రాఫర్ గా విజయ్ ని ఈ మూవీతో పరిచయం చేస్తున్నారు.
''ఇదివరకు మా సంస్థలో చిన్న సినిమాల్ని తెరకెక్కించాం. కొంతకాలంగా స్టార్ హీరోల చిత్రాలకే పరిమితమయ్యాం. ఐదేళ్ల తర్వాత మళ్లీ 'కేరింత' పేరుతో ఓ చిన్న చిత్రాన్ని చేసాం'' అన్నారు దిల్‌రాజు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: విశ్వ, కూర్పు: మధు, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











