రిహన్నా చేసిన ట్వీట్ ఖరీదు 18 కోట్లు.. పాప్ సింగర్‌ గుట్టు రట్టు.. కంగన తీవ్ర ఆరోపణలు!

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళన, దానిపై చేస్తున్న ట్వీట్లు దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్వీట్ల వార్ ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో పాప్‌ సింగర్ రిహన్నా చేసిన ట్వీట్ మరింత వివాదంగా మారింది. అయితే రైతులు మద్దతుగా చేసిన ట్వీట్ కోసం రిహన్నా భారీ మొత్తంలో స్వీకరించినట్టు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

101 మిలియన్ల ఫాలోవర్స్‌

101 మిలియన్ల ఫాలోవర్స్‌

అంతర్జాతీయంగా పాపులారిటీ ఉన్న రిహన్నాకు సోషల్ మీడియాలోని ట్విట్టర్‌లో 101 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. భారత్‌తోపాటు పలు దేశాల్లో భారీగా ఫాలోవర్స్ ఉన్న ఆమె ద్వారా ట్వీట్ వెళ్లే భారీ ప్రభావం ఉండటం సహజం. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా రిహన్నా ట్వీట్ చేయడం సంచలనం రేపింది.

రిహన్నా ట్వీట్‌పై అనుమానాలు

రిహన్నా ట్వీట్‌పై అనుమానాలు

దేశంలో జరుగుతున్న రైతు ఉద్యమంపై అంతర్జాతీయ సింగర్ రిహన్నా ట్వీట్ చేయగానే అందరిలోనూ అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తులు, సెలబ్రిటీలు ఇదేదో కుట్రగా అభివర్ణించారు. ఇక సర్కారుకు వ్యతిరేకంగా ఉన్న వారు రిహన్నా ట్వీట్‌తో రైతుల సమస్య అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించినట్టు పేర్కొన్నారు.

రిహన్నా ట్వీట్ వెనుక గుట్టు ఇలా

రిహన్నా ట్వీట్ వెనుక గుట్టు ఇలా


ఇక రిహన్నా ట్వీట్వ్‌పై విపరీతమైన వాదనలు, వివాదాలు చెలరేగుతున్న క్రమంలో జాతీయ మీడియాకు చెందిన పలు ఛానెల్స్, వెబ్‌సైట్లు రిహన్నా గుట్టును విప్పేందుకు ప్రయత్నించాయి. రైతులకు మద్దతుగా ట్వీట్ చేసినందుకు భారీ మొత్తాన్ని స్వీకరించిందనే విషయాన్ని బయటపెట్టాయి.

ఒక్క ట్వీట్ కోసం 18 కోట్లు

ఒక్క ట్వీట్ కోసం 18 కోట్లు

ది ప్రింట్, ఇతర మీడియా వెల్లడించిన ప్రకారం.. రైతులకు మద్దతుగా ట్వీట్ చేయడానికి రిహన్నా రెండున్నర మిలియన్ల డాలర్లు తీసుకొన్నది. అంటే రూపాయల్లో లెక్కిస్తే 18 కోట్లుగా లెక్క కట్టారు. ఈ మొత్తాన్ని కెనడాకు చెందిన పోయటిక్ జస్టిస్ ఫౌండేషన్ (పీజేఎఫ్) చెల్లించదనే విషయాన్ని తన వార్త కథనంలో పేర్కొన్నది. ఈ వ్యవహారం వెనుక పంజాబ్‌లోని సంపన్న రైతులు హస్తం ఉందనే విషయాన్ని వెల్లడించారు.

రిహన్నాపై కంగన తీవ్ర ఆరోపణలు

రిహన్నాపై కంగన తీవ్ర ఆరోపణలు

రిహన్నా ట్వీట్‌పై బాలీవుడ్ నటి కంగన రనౌత్ కూడా అనుమానం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ టీవీతో కంగన మాట్లాడుతూ.. ఫోర్బ్స్ జాబితా ప్రకారం రిహన్నా ఆస్తి 4300 కోట్ల రూపాయలు. రైతులకు మద్దతుగా ట్వీట్ చేయడానికి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకొన్నదనే ఆరోపణలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X