twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్ని రోజులు నోరుమూసుకుని ఉండాలి: సినీ పరిశ్రమలో సెక్సిజం మీద హీరోయిన్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    సినీ పరిశ్రమలో సెక్సిజం.. నోరువిప్పిన హీరోయిన్!

    సినీ పరిశ్రమలో జెండర్ డిస్క్రిమినేషన్ మీద కాంపెయినింగ్ చేస్తున్న మలయాళం నటి రీమా కలింగల్ ఇటీవల ఓ సదస్సులో ఆసక్తికరంగా ప్రసంగించారు. పరిశ్రమలో సెక్సిజం ఏ స్థాయిలో ఉందో వివరించే ప్రయత్నం చేశారు.

     ఇండస్ట్రీలోకి వచ్చినపుడు...

    ఇండస్ట్రీలోకి వచ్చినపుడు...

    నేను మలయాళం ఇండస్ట్రీలోకి ఎంటరైనపుడు.... ‘ సెల్ఫ్ లైఫ్, అడ్జెస్ట్, కాంప్రమైజ్, స్మైల్ మోర్, నోరు మూసుకుని ఉండు' లాంటి పదాలు ఎక్కువగా ఉన్నానని, ఇక్కడ అందరూ మహిళలను నోరుమూసుకుని ఉండమని చెప్పేవారే.... అని రీమా కలింగల్ వ్యాఖ్యానించారు.

    ఎంతకాలం నోరు మూసుకుని ఉండాలి

    ఎంతకాలం నోరు మూసుకుని ఉండాలి

    ఇండస్ట్రీలో తమకు ఏం జరిగినా బయటకు చెప్పకుండా భరిస్తూ నోరు మూసుకుని ఉండాలా? ఎంతకాలం దీన్ని భరించాలి? ఎంత కాలం ఇలా మౌనంగా ఉండాలి? అంటూ రీమా కలింగల్ ప్రశ్నించారు.

    లైంగిక వేధింపుల విషయం గుర్తు చేసిన రీమా

    లైంగిక వేధింపుల విషయం గుర్తు చేసిన రీమా

    2017 ఫిబ్రవరిలో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటి భావనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఈ సందర్భంగా రీమా కలింగల్ గుర్తు చేశారు. ఆ సమయంలో కూడా ఆమెపై కొందరు ఒత్తిడి తెచ్చారని, ఎంత కాలం మేము ఇలా నోరు మూసుకుని మౌనంగా ఉండాలని ప్రశ్నించే ప్రయత్నం చేశారు రీమా కలింగల్.

     రెమ్యూనరేషన్ విషయంలో కూడా

    రెమ్యూనరేషన్ విషయంలో కూడా

    2017లో హీరోలు తీసుకునే రెమ్యూనరేషన్లో హీరోయిన్లకు మూడో వంతు కూడా అందలేదు. ఇదేంటని అడిగితే.... మీ వల్ల సినిమాలకు శాటిలైట్ రైట్స్ రావడం లేదు, మీ వల్ల బాక్సాఫీసు బిజినెస్ జరుగడం లేదు అంటారని రీమా కలింగల్ వెల్లడించారు.

     ఆ పది మందే రూల్ చేస్తున్నారు

    ఆ పది మందే రూల్ చేస్తున్నారు

    సినిమా ఇండస్ట్రీలో 150 మంది నటీమణులు ఉన్నారు. కానీ ఇండస్ట్రీలో ఉన్న ఆ 10 మంది హీరోలే ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు. ఈ 150 మంది మాట చెల్లదు, ఏ విషయంలో అయినా కేవలం ఈ 10 మంది మాటే చెల్లుతుంది అని రీమా కలింగల్ తెలిపారు.

    ఆ గైడ్ లైన్స్ ఎందుకు పాటించడం లేదు

    సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.... వర్క్ ప్లేసులో విశాఖ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. సెక్సువల్ హరాస్మెంట్ జరుగకుండా తగిన సిస్టం ఉండాలి. కానీ ప్రభుత్వానికి 40శాతం ఎంటర్టెన్మెంట్ టాక్స్ కడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం విశాఖ గైడ్ లైన్స్ ఎందుకు పాటించడం లేదు అని రీమా కలింగల్ ప్రశ్నించారు.

    English summary
    Malayalam Movie Industry is perhaps the most well-respected movie industry among the Indian movies Industries. In this talk, Danseuse and Actress, Rima Kallingal challenges the status quo and questions the narrative as it currently exists in one of the largest movie Industry in India. She has been fighting gender-based discrimination since the time she was a child and her fight for equality has led her to co-found along with other actresses in the Malayalam movie industry, the Women in Cinema collective, a rights based group dealing with issues faced by women in the Movie industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X