twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షీలా దీక్షిత్ రాక: హీరోయిన్ వివాదాస్పద వ్యాఖ్యలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ కేరళ గవర్నర్‌గా వస్తున్న నేపత్యంలో మళయాల నటి రీమా కలింగల్ ఫేస్ బుక్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. షీలా దీక్షిత్ అపాయింట్‌మెంట్‌కు సంబంధించిన పేపర్ క్లిప్‌ను ఫేస్ బుక్‌లో పోస్టు చేసిన రీమా....'మహిళా జర్నలిస్టులు అందరూ జాగ్రత్త....అందరూ 6 గంటలకే ఇళ్లకు చేరుకోండి. షీలా దీక్షిత్ వస్తున్నారు' అని కామెంట్ చేసింది.

    షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008లో ఓ మహిళ జర్నలిస్టు రాత్రిపూట మరణించింది. అప్పట్లో షీలా దీక్షిత్ ఆ ఘటనపై స్పందిస్తూ మహిళ జర్నలిస్టులు రాత్రి పూట అతి సాహసాలు చేయకపోవడమే మంచిది అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రీమా కలింగల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

     Rima Kallingal ridicules Sheila on Facebook

    రీమా కలింగల్ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా....కొందరేమో ఆమె కామెంట్స్‌ను లైక్ చేసారు. ఏది ఏమైనా వ్యాఖ్యలు చేయడం ద్వారా మీడియాలో చర్చనీయాంశం అయింది రీమా కలింగల్. మరి షీలా గవర్నర్‌గా వచ్చిన తర్వాత ఆమె ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందో చూడాలి.

    రీమా కలింగల్ గురించిన విషయాల్లోకి వెళితే...2009లో శ్యామప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన 'రితు' మళయాల చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసింది. అనంతరం '22 ఫిమేల్ కొట్టాయం' అనే చిత్రంలో కూడా రీమా కలింగల్ నటించారు. రీమా కలింగల్‌కు వివాదాలు కొత్తేమీ కాదు.

    English summary
    
 Popular Malayalam film actor Rima Kallingal in a Facebook post, shared a newspaper clip on Dikshit’s appointment, said: “All women journalists in Kerala… Beware… You will all have to get home by 6 pm if Sheila Diskhit has her way!”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X