ఆ హీరోయిన్ బరువు 160 కేజీలు...

పార్టనర్ హిట్టయిన దగ్గరనుండి గోవిందాకు ఎక్కడలేని డిమాండు వచ్చింది.ఆయన తో సినిమాలు చేయటానికి దర్శక,నిర్మాతలు,హీరోయిన్లు ఎగపడుతున్నారు. అందుకోంసం బరువు పెంచటమేమిటి మరే రకంగా ఉండాలన్నా సరే అంటున్నారు. సినిమాలో లావుపాటి రిమీని చూసి గోవిందా ప్రేమలో పడతాడు. అక్కడనుండి నవ్వులు జల్లులు కురుస్తాయి. ఆమె ఈ సినిమాలో జర్నలిస్టుగా కనిపిస్తుందిట. రోజంతా షూటింగ్ జరిగినన్నాళ్ళూ పూర్తి మాస్క్ తో ఉండాలిట.
మొదట ఈ కండీషన్ రిమీకి విసుగ్గా అనిపించినా కథ విన్నాక ఆసక్తి పెరిగిపోయిందిట. మరి అలాగే అంత అందమైన అ మ్మాయిని అలా లావుగా అసహ్యంగా చూపెడతారా అంటే ...చూడండి ఆమె మరింత గ్లామర్ తో ఉంటుందంటున్నాడు దర్శకుడు. ఇంతకీ ఈ సినిమా హాలీవుడ్ హిట్ 'షాలో హాల్' నుండి పుడుతోందని ఓ ప్రక్క గుసగుసలు వినపడుతున్నాయి. ఇంతకీ రిమీ అసలు బరువెంతో తెలుసా...55 మాత్రమే.


Click it and Unblock the Notifications











