‘రింగ రింగా...’ బీభత్సమైన ఫాలోయింగ్: రాజమౌళి
దర్శకధీరుడు వరుస సక్సెస్ చిత్రాల దర్శకుడూ భారీ చిత్రాల ధీరుడు..రాజమౌళి భయపడడం ఏంటి? అని ఆశ్చర్యంగా ఉంది కదూ! అవును ఆయన నిజంగా భయపడ్డాడట! ఆయనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. అల్లు అర్జున్ కాజల్ జంటగా నటించిన 'ఆర్య 2" ఆడియో వేడుక ఆదివారం నాడు రాక్ గార్డెన్స్ లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి, వినాయక్, శ్రీనువైట్ల మెహర్ రమేష్, ప్రభాస్, దిల్ రాజు, కె. యల్. నారాయణ, క్రిఫ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా రాజమౌళి మాట్లాడుతూ 'ఆర్య 2" సినిమా చూసి ఫస్ట్ టైమ్ భయమేసింది. ఈ డైరెక్టర్ ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చాడు అనుకున్నాను. తెలుగు సినిమాను నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో 'రింగా రింగా..." పాటకి బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చేసింది. మ్యూజిక్ ప్రియుల్లో. ఇక పాటలు అధికారికంగా విడుదలవడంతో ఎక్కడ విన్నా 'రింగ రింగా..." పాటే ప్రముఖంగా వినిపిస్తోంది ఈ సాంగ్ నెక్ట్స్ ఇయర్ టాప్ ఒన్ పాట గా నిలుస్తుంది" అన్నారు.
ఫస్ట్ హియరింగ్ లోనే 'ఆర్య 2" ఆడియో సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొన్నది. మ్యూజిక్ అదరహొ అనే రేంజ్ లో వుంటే, ప్రోమోస్ లో అల్లు అర్జున్ డాన్స్ మూవ్ మెంట్స్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. 'బేబీ హిలవ్స్ యూ" పాటతోనే సినిమాలో కంటెంట్ ఏంటో అర్థమయిపోతున్నా, 'ఆర్య 2" తో సుకుమార్ ఎలాంటి మ్యాజ్ చేశాడో తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్పిందే.


Click it and Unblock the Notifications











