అమితాబ్‌పై మళ్లీ హత్య కేసు గొడవ!

అమితాబ్ పై ఇలాంటి ఆందోళనలు జరుగడం వెనక పెద్ద కథే ఉంది. ఇందిరా గాంధీ అభిమాని అయిన అమితాబ్....1984లో ఇందిర సిక్కు బాడీగార్డుల చేతిలో హత్యకు గురైన అనంతరం 'ఖూన్ కా బదలా ఖూన్"(హత్యకు హత్యే సమాధానం) అంటూ ఆవేశ పూరితంగా ప్రసంగించారట. ఇందిర హత్యకు ప్రతీకారంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అప్పట్లో హింస చెలరేగింది. ఈ గొడవల్లో అనేక మంది సిక్కు యువకులు హత్య చేయబడ్డారు. ఈ హత్యలకు అమితాబ్ రెచ్చగొట్టుడు వ్యాఖ్యలే కారణమని కొందరి వాదప.
ఈ మేరకు సిక్కు బాధిత కుటుంబాలకు చెందిన వారు.... అమితాబ్ పై చార్జ్ షీట్ దాఖలు చేయడాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 5న ఫిర్యాదు చేయడంతో పాటు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిక్కు సంస్థలకు చెందిన నాయకులు ప్రకటించారు.
amitabh bachchan all india sikh students federation అమితాబ్ బచ్చన్ ఆలిండియా సిక్కు స్టూడెంట్ ఫెడరేషన్


Click it and Unblock the Notifications