RIP KV Anand: గుండె ముక్కలైంది.. ఇక నీవు లేవంటే.. రజనీ, కమల్, అల్లు అర్జున్, కీర్తి సురేష్ ఎమోషనల్!
ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కేవీ ఆనంద్ ఇకలేరు. గుండెపోటుకు గురైన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఏప్రిల్ 30వ తేదీ తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి కమల్ హాసన్, రజనీకాంత్, అల్లు అర్జున్ సంతాపం తెలియజేస్తూ..
Recommended Video

కమల్ హాసన్ తీవ్ర దిగ్బ్రాంతి
కేవీ ఆనంద్ ఓ మ్యాగజైన్‌లో ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తూ అద్భుతమైన సినిమాటోగ్రాఫర్‌గా మారారు. ఆ తర్వాత డైరెక్టర్‌గా ఎన్నో మంచి చిత్రాలను రూపొందించారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం అని కమల్ హాసన్ సంతాపం వ్యక్తం చేశారు.

రజనీకాంత్ సంతాపం
దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కేవీ ఆనంద్ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. చాలా బాధాకరంగా మారింది. ఆయన మరణంతో విషాదంలో కూరుకుపోయిన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. కేవీ ఆనంద్ ఆత్మకు శాంతి చేకూరాలని రజనీకాంత్ సంతాపం వ్యక్తం చేశారు.

కరోనాను తేలికగా తీసుకోవద్దు
కరోనావైరస్ మహమ్మారి మంచి మనసులను కబలిస్తున్నది. కేవీ ఆనంద్ మరణంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. కరోనా అంటే ఓ రకమైన భయం ఏర్పడింది. దానిని జోక్‌గా తీసుకోకూడదు. అందరూ సేఫ్‌గా ఉండండి. ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించండి. మాస్క్, శానిటైజర్ వాడండి. ఏదైనా సమస్య ఎదురైతే ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా మాకు సమాచారం చేరవేయండి అంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపారు.

ఇంకా నమ్మలేకపోతున్నాను..
కేవీ ఆనంద్ మరణించారనే వార్తను ఇంకా నమ్మలేకపోతున్నాను. మరణవార్త వినగానే హృదయం ముక్కలైంది. ఈ వార్త నిజం కాకపోతే బాగుండనిపించింది అంటూ హీరో ఆర్య సంతాపం వ్యక్తం చేయగా, మీరు లేరని వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. సినిమా పరిశ్రమ మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది అంటూ హీరో శిబి సత్యరాజ్ ట్వీట్ చేశారు.

అద్భుతమైన దర్శకుడు అంటూ
కేవీ ఆనంద్ సార్ మరణించారనే వార్తతో చాలా కలత చెందాను. అద్భుతమైన సినిమాటోగ్రాఫర్, దర్శకుడిగా తన ముద్ర వేసుకొన్నారు. సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలపై విశేషమైన గౌరవం ఏర్పడింది. ఆనంద్ సార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. విషాదంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ కీర్తీ సురేష్ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు.

దుర్వార్తతో నిద్ర లేచాను
డైరెక్టర్ కేవీ ఆనంద్ ఇకలేరనే దుర్వార్తతో నిద్రలేచాను. వండర్‌ఫుల్ కెమెరామెన్. బ్రిల్లియెంట్ డైరెక్టర్, వెరీ నైస్ జెంటిల్మన్. మిమ్మల్ని చిరకాలం గుర్తుంచుకొంటాను. మీరు లేని లోటు తీర్చలేనిది అంటూ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

జీవితాంతం రుణపడి ఉంటా
కేవీ ఆనంద్ మృతిపై అమీరా దస్తర్ స్పందిస్తూ.. ఇప్పటి వరకు నేను పనిచేసిన సినీ ప్రముఖుల్లో అంకితభావం, క్రమశిక్షణ కలిగిన దర్శకుడు ఆయన. తమిళ చిత్ర పరిశ్రమకు మీరు నన్ను పరిచయం చేశారు. అందుకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. సినిమా పరిశ్రమ గొప్ప దర్శకుడిని కోల్పోయింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు.


Click it and Unblock the Notifications











