For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RIPBARajuGaru: బీఏ రాజు మృతిపై సమంత ఎమోషనల్.. చిరు అలా.. తారక్ ఇలా.. సెలెబ్రిటీల కన్నీటి పర్యంతం

  |

  దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫిల్మ్ జర్నలిస్టుగా, నిర్మాతగా, పీఆర్‌ఓగా సేవలు అందిస్తోన్న బీఏ రాజు శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా మధుమేహ వ్యాధితో బాధపడుతోన్న ఆయన.. ఈ మధ్య దాని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్నారు. శుక్రవారం రాత్రి షుగర్ హెచ్చుతగ్గుల కారణంగా గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా ప్రాణాలను విడిచారు. దీంతో సినీ లోకం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక, బీఏ రాజు మరణంపై ప్రముఖులంతా ఎమోషనల్ అవుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఎవరెలా స్పందించారో చూడండి!

  సినీ పరిశ్రమకు తీరని లోటు: ఎన్టీఆర్

  సినీ పరిశ్రమకు తీరని లోటు: ఎన్టీఆర్

  బీఏ రాజు మరణంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ‘బీఏ రాజు గారి మరణ వార్త నన్ను షాక్‌కు గురి చేసింది. ఫిల్మ్ జర్నలిస్టుగా, పీఆర్ఓగా ఆయన సేవలు మర్చిపోలేనివి. నా కెరీర్ ఆరంభం నుంచి ఆయన నాకు తెలుసు. చిత్ర పరిశ్రమకు ఇది లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా' అంటూ పేర్కొన్నాడు.

  ఎంతో అనుబంధం ఉంది: కల్యాణ్ రామ్

  ఎంతో అనుబంధం ఉంది: కల్యాణ్ రామ్

  బీఏ రాజు మృతిపై నందమూరి కల్యాణ్ రామ్ స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ‘ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్, పీఆర్ఓ బీఏ రాజు గారు మరణించారన్న వార్త నన్ను షాక్‌కు గురి చేసింది. ఆయన నాతో కలిసి ఎన్నో సందర్భాల్లో, ఎన్నో ఏళ్లుగా పని చేశారు. ఇది సినీ ఇండస్ట్రీలోకి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా' అంటూ రాసుకొచ్చాడు.

  మా ఫ్యామిలీకి సపోర్ట్ చేశారు: నాగ శౌర్య

  మా ఫ్యామిలీకి సపోర్ట్ చేశారు: నాగ శౌర్య

  బీఏ రాజు మరణంపై నాగ శౌర్య స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ‘బీఏ రాజు గారి ఆకస్మిక మరణంతో షాక్ అయ్యాను. ఫీల్డ్ జర్నలిజంలో ఆయన ఒక లెజెండ్. మా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటూ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని మిస్ అవుతున్నాం సార్' అంటూ వెల్లడించాడు.

  కలకాలం గుర్తుండిపోతావు: రాఘవేంద్రరావు

  కలకాలం గుర్తుండిపోతావు: రాఘవేంద్రరావు

  బీఏ రాజు మృతిపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘బీఏ రాజు... నువ్వు లేని తెలుగు సినిమా మీడియా మరియు పబ్లిసిటీ, ఎప్పటికీ లోటే... తరతరాలుగా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అందించిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. నీ ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అంటూ పేర్కొన్నారు.

  గొప్ప నాలెడ్జ్ బ్యాంక్ ఆయన: చిరంజీవి

  గొప్ప నాలెడ్జ్ బ్యాంక్ ఆయన: చిరంజీవి

  బీఏ రాజు ఆకస్మిక మరణంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘బీఏ రాజు గారి మరణ వార్త నన్ను తీవ్ర వేదనకు గురి చేసింది. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నా' అంటూ సుదీర్ఘమైన లేఖను రాశారు. అందులో ఆయన అన్ని రికార్డులను కచ్చితంగా చెప్పగలిగే నాలెడ్జ్ బ్యాంక్ అంటూ కొనియాడారు చిరు. ఇందులో ఎన్నో విషయాలను గుర్తు చేసుకున్నారు.

  ఆయనుంటే ధైర్యంగా ఉండేది: అనసూయ

  ఆయనుంటే ధైర్యంగా ఉండేది: అనసూయ

  బీఏ రాజు మృతిపై యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘ఉదయాన్నే భయంకరమైన వార్తను విన్నాను. నా పుట్టినరోజున ఆయనతో మాట్లాడాను. ఎప్పుడూ ధైర్యం చెబుతూ ప్రోత్సహించేవారు. యాంకర్‌గా చేసినప్పటి నుంచి నాకు అండగా ఉన్నారు. ఆయన ఉంటే ధైర్యంగా ఉండేది. నేను ఆయనను బారాజుగారు అనేదాన్ని' అంటూ చెప్పుకొచ్చింది.

  నా జీవితంలో వెలుగులా ఉన్నారు: సమంత

  నా జీవితంలో వెలుగులా ఉన్నారు: సమంత

  బీఏ రాజు ఆకస్మిక మరణంపై అక్కినేని సమంత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘బీఏ రాజు గారు నా జీవితంలో సానుకూల వెలుగులు నింపేవారు. నా మొదటి చిత్రం నుంచి ప్రతి దానికి ఇదే చేశారు. హిట్ అయినా ఫ్లాప్ అయినా నా వెంటే ఉన్నారు. నేను మిమ్మల్సి భయంకరంగా మిస్ అవుతున్నా సార్. ఇది తీరని లోటు' అంటూ ఎమోషనల్ అయిందామె.

  అందుకు ధన్యవాదాలు సార్: ప్రకాశ్ రాజ్

  అందుకు ధన్యవాదాలు సార్: ప్రకాశ్ రాజ్


  బీఏ రాజు మృతిపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘హో.. నో.. ఇది చాలా విచారకరమైన వార్త. రాజు గారూ మీ గొప్ప సేవలను సినీ పరిశ్రమ కోల్పోయింది. అందరికీ నిత్యం అందుబాటులో, అండగా ఉన్న మీకు ధన్యవాదాలు. మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. మిమ్మల్ని మిస్ అవుతున్నా' అంటూ పేర్కొన్నాడాయన.

  లోటును ఎవరూ పూడ్చలేరు: రాజమౌళి

  లోటును ఎవరూ పూడ్చలేరు: రాజమౌళి


  బీఏ రాజు ఆకస్మిక మరణంపై దర్శకధీరుడు రాజమౌళి స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘బీఏ రాజు గారి ఆకస్మిక మరణ వార్తకు నిజంగా షాక్ అయ్యాను. సీనియర్ మెంబర్‌ను కోల్పోయాం. 1500లకు పైగా సినిమాలకు పీఆర్ఓగా, ఫిల్మ్ జర్నలిస్టుగా చేసిన ఆయనను కోల్పోయాం. మీ లోటును ఎవరూ పూడ్చలేరు' అంటూ చెప్పుకొచ్చాడు జక్కన్న.

  అందరికీ బంధువులా ఉన్నారు: నరేష్

  అందరికీ బంధువులా ఉన్నారు: నరేష్

  బీఏ రాజు మృతిపై అల్లరి నరేష్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘బీఏ రాజు గారి మరణ వార్త విని నిర్ఘాంతపోయాను. ఆయన ఎన్నో సినిమాలకు మార్గదర్శిలా పని చేశారు. ప్రతి ఒక్కరితోనూ పర్సనల్ బందాన్ని ఏర్పరచుకున్నారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా సార్' అంటూ ట్వీట్ చేశాడు.

  BA Raju : Mahesh Babu కి Loyal PRO, Tollywood Encyclopaedia || Filmibeat Telugu
  ఆ నవ్వుల ముఖాన్ని కోల్పోయాం: రామ్

  ఆ నవ్వుల ముఖాన్ని కోల్పోయాం: రామ్


  బీఏ రాజు ఆకస్మిక మరణంపై రామ్ పోతినేని స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘ఆ నవ్వుల ముఖాన్ని.. ఆ సానుకూల బలాన్ని.. ప్రోత్సహించే ఆ మాటలను.. ఎప్పటికీ మర్చిపోలేము. మీరు ఎంతో సహృదయులు. మిమ్మల్ని మిస్ అవుతాం రాజుగారూ. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ రాసుకొచ్చాడు.

  English summary
  Tollywood Producer, PRO, Super Hit Magazine Founder BA Raju Passes Away Due Cardic Arrest Friday Night.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X