వైద్యం ఓ తపస్సు(ఋషి ప్రివ్యూ)
ప్రముఖ నిర్మాణ సంస్ధ ప్రసాద్ ప్రొడక్షన్స్ ప్రై.లి. ముప్పై సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత నిర్మిస్తున్న చిత్రం రిషి. రాజ్ మాదిరాజ్ అనే నూతన దర్శకుడు ని పరిచయం చేస్తూ రూపొందిన ఈ చిత్రం ఈ రోజు(శుక్రవారం)విడుదల అవుతోంది. ఈ చిత్రం కథ లో..ఋషి (అరవింద్ కృష్ణ) వైద్య విద్యార్థి. కళాశాలలో చదువుతున్నప్పుడు పూజ (సుప్రియ శైలజ) పరిచయం అవుతుంది. అది కాస్తా ప్రేమగా మారుతుంది. వైద్య విద్యని పూర్తి చేసి బయటకొచ్చిన వీరికి కార్తీక్ (మాస్టర్ గౌరవ్) అనే బాలుడు తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలుస్తుంది. అతనికి వైద్యం చేయాలనుకున్నా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అవేమిటి? వాటిని ఋషి ఏ విధంగా అధిగమించి విజయం సాధించాడనేది అసలు కథ. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''వైద్య విద్యార్థుల జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతినీ, భావోద్వేగాల్నీ పంచేలా కథ, కథనాలుంటాయి'' అన్నారు.
సంస్థ: ప్రసాద్ ప్రొడక్షన్స్ ప్రై.లి.
నటీనటులు: అరవింద్‌కృష్ణ, సుప్రియ శైలజ, సురేష్, రవిప్రకాష్, రంగనాథ్, మాస్టర్ గౌరవ్ తదితరులు
నిర్మాత: ఎ.రమేష్ ప్రసాద్
దర్శకత్వం: రాజ్ మాదిరాజ్
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications











