నేను ఎద్దు మాంసం తినే హిందువును
హైదరాబాద్: రణబీర్ కపూర్ తండ్రి, బాలీవుడ్ సీనియస్ స్టార్, ఒకప్పటి లవర్ బాయ్ రిషి కపూర్ ఎద్దు మాంసంపై నిషేదం విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘నేను చాలా కోపంగా ఉన్నాను. ఆహారాన్ని మతంతో ఎందుకు ముడి పెడతారు? నేను ఎద్దు మాంసం తినే హిందువును. అంటే నేను...అది తినని వారి కంటే....దేవుడికి తక్కువ భయపడే వ్యక్తిని అని అర్థమా? కాస్త ఆలోచించండి' అంటూ ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఎద్దు మాంసంపై నిషేదం విధించింది. ఈ నేపథ్యంలో రిషి కపూర్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం దారిలోనే హర్యానా ప్రభుత్వం కూడా ఇదే దారిలో నడిచే ఆలోచనలో ఉంది. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఝార్కండ్, రాజస్థాన్ లు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నాయి.

అయితే నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను జంతువులను చంపడాన్ని సమర్థించడం లేదు. రాజకీయ నాయకులు ఆడుతున్న డబుల్ గేమ్‌ను నేను అసహ్యించుకుంటున్నాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు రిషి కపూర్. మరి రిషి కపూర్ వ్యాఖ్యలకు ఎవరెవరి మద్దతు లభిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











