»   » రేపు నేను చచ్చినా ఎవరూ రారేమో? చంచా గాళ్లు... అంటూ యంగ్ హీరోల తీరుపై ఫైర్

రేపు నేను చచ్చినా ఎవరూ రారేమో? చంచా గాళ్లు... అంటూ యంగ్ హీరోల తీరుపై ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా గురువారం అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అత్యక్రియలకు యంగ్ జనరేషన్ స్టార్స్ హాజరు కాకపోవడంపై బాలీవుడ్ సినీయర్ స్టార్ రిషి కపూర్ మండి పడ్డారు.

ఈ తరం నటుల వ్యవహార శైలిపై రిషీ కపూర్ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ప్రియాంక చోప్రా ఇచ్చిన పార్టీకి వెళ్లడానికి మీ లాంటి చంచా పీపుల్ కి సమయం ఉంటుంది, వినోద్ ఖన్నా లాంటి గొప్ప నటుడి అంత్యక్రియలకు రావడానికి మీకు కుదరడం లేదా అంటూ ఫైర్ అయ్యారు.

సిగ్గు చేటు

సిగ్గు చేటు

‘ఈ జనరేషన్‌కు చెందిన ఒక్క నటుడు కూడా అంత్యక్రియలకు రాకపోవడం సిగ్గుచేటు. పైగా వినోద్‌ఖన్నా వారితో కలిసి నటించారు కూడా. పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి' అంటూ రిషి కపూర్ ట్వీట్ చేసారు.

రేపు నన్ను మోయడానికి కూడా రారేమో?

రేపు నన్ను మోయడానికి కూడా రారేమో?

‘రేపు నేను చనిపోయినప్పుడు కూడా నన్ను భుజాన మోసేందుకు ఎవరూ రారమో? దీనికి నేను ప్రిపేర్‌ అయి ఉండాలి. ఈ తరం సోకాల్డ్ స్టార్లపై చాలా కోపంగా ఉంది అంటూ రిషి కపూర్ మండి పడ్డారు.

నా భార్య, కొడుకు విదేశాల్లో అందుకే రాలేదు

నా భార్య, కొడుకు విదేశాల్లో అందుకే రాలేదు

‘నా భార్య, కుమారుడు విదేశాల్లో ఉన్నారు. అందుకే రాలేకపోయారు'.... నీతూ కపూర్, రణబీర్ కపూర్ ఈ అంత్యక్రియలకు గైర్హాజరు కావడంపై వివరణ ఇచ్చారు రిషి కపూర్.

చంచా గాళ్లు

చంచా గాళ్లు

ప్రియాంక చోప్రా ఇచ్చిన పార్టీకి వెళ్లడానికి మీ లాంటి చంచాగాళ్లకు సమయం ఉంటుంది. కానీ వినోద్ ఖన్నా లాంటి గొప్పవ్యక్తికి గౌరవం ఇవ్వడానికి మీకు సమం ఉండుదు అంటూ రిషి కపూర్ తీవ్రంగానే మండి ప డ్డారు

ప్రముఖుల హాజరు

ప్రముఖుల హాజరు

వినోద్‌ ఖన్నా అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముంబయిలో జరిగాయి. రిషికపూర్‌ సహా బాలీవుడ్‌ ప్రముఖ నటులు అమితాబ్‌బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, జాకీష్రాఫ్‌, రణ్‌దీప్‌ హుడా, చుంకీ పాండే తదితరులు హాజరయ్యారు.

English summary
Veteran actor and an active Twitter user, Rishi Kapoor has slammed young Bollywood actors for not turning up at the funeral of late Vinod Khanna. The actor criticised the young Bollywood brigade on Twitter. Disappointed and angry with the behavior, Kapoor tweeted, "Shameful. Not ONE actor of this generation attended Vinod Khanna's funeral. And that too he has worked with them. Must learn to respect."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu