బాలీవుడ్ నట దిగ్గజం నేలరాలింది.. విసాదంలో బాలీవుడ్. చిరంజీవి, రాంచరణ్, క్రిష్, శిల్పాశెట్టి సంతాపం

బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు రిషి కపూర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ముంబైలో మరణించారు. బుధవారం సాయంత్రం అస్వస్థతకు గురవ్వడంతో ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన వెంట భార్య నీతూ కపూర్, కుమారుడు, సినీ హీరో రణ్‌బీర్ కపూర్, సోదరుడు రణధీర్ కపూర్ ఉన్నారు. ఆయన మరణంతో తీవ్ర దిగ్రాంతికి లోనైన సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకొన్నారు. సోషల్ మీడియాలో ఆయనపై సంతాపం వ్యక్తం చేసిన వారిలో..

Recommended Video

#RishiKapoor : Celebrities And Politicians Pay Tribute To Rishi Kapoor

గుండె ముక్కలైంది.. రాంచరణ్

ప్రముఖ నటుడు రిషి కపూర్ ఇక లేరు అనే వార్తతో గుండె ముక్కలైంది. భారతీయ సినిమాకు విశేష సేవలందించిన నట దిగ్గజ తార నేలరాలింది. కపూర్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని రాంచరణ్ ట్వీట్ చేశారు.

స్టార్లకు స్ఫూర్తి.. అర్బాజ్ ఖాన్

రిషికపూర్ సార్ మరణ వార్తతో షాక్ గురయ్యాను. ఆయన ఇక లేరనే విషయంతో తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాను. ఎంతో మంది నటీనటులకు, అభిమానులకు స్ఫూర్తిని నింపిన నటుడు. బాలీవుడ్‌లోకి నేను అడుగుపెట్టిన చిత్రం దరార్ చిత్రంలో నాతో కలిసి నటించారు. ఆయన సహనం, నిజాయితీ నన్ను ఎంతో ఆకట్టుకొన్నాయి. ఆయన లేని లోటు తీరని. రిషీ కపూర్ ఆత్మకు శాంతి చేకూరాలి అని అర్బాజ్ ఖాన్ ట్వీట్ చేశారు.

ఐకాన్ నేలరాలింది.. మమతా బెనర్జీ

ఐకానిక్, విలక్షణ నటుడు రిషి కపూర్ మరణవార్తతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. ఆయన లేరన్న వార్తతో విషాదంలో మునిగిపోయాను. జాతీయ అవార్డు గ్రహీత, 150కిపైగా సినిమాల్లో నటించిన ఆయన మరణించడం హిందీ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన మరణంతో విషాదంలో కూరుకుపోయిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు, సినీ పరిశ్రమ ప్రముఖులకు నా ప్రగాఢ సంతాపం అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.

హృదయం ముక్కలైంది.. శిల్పాశెట్టి

హృదయం ముక్కలయ్యే వార్తతో నిద్రలేచాను. రిషి కపూర్ మరణవార్త నన్ను తీవ్రంగా కలిచివేస్తున్నది. కోట్లాది సినీ ప్రేక్షకులకు ఆయన ఆరాధ్యుడు. అలాంటి వ్యక్తి లేరంటే నేను నమ్మలేకపోతున్నాను. రానున్న తరాలకు కూడా నీ నటన, ప్రతిభ స్పూర్తిని కలిగిస్తుంది అని శిల్పాశెట్టి అన్నారు.

మరో అణిముత్యం నేలరాలింది.. చంద్రబాబు

మరో సినీ దిగ్గజం రిషి కపూర్ కన్నుమూశారు. ఆయన మృతివార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయాను. భారతీయ సినిమా పరిశ్రమ మరో ఆణిముత్యం నేల రాలింది. రిషి కపూర్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు.

ఆత్మకు శాంతి చేకూరాలి: చిరంజీవి

రిషి జీ లేరనే వార్త ఒక్కసారి నన్ను కుదిపేసింది. నాకు అత్యంత స్నేహితుడు. గొప్ప నటుడు. లవర్ బాయ్ ఇమేజ్‌తో లక్షలాది మంది హృదయాలను దోచుకొన్న హీరో. గొప్ప లెగసీ ఉన్న నటుడు. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఆయనకు నా కన్నీటి వీడ్కోలు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని చిరంజీవి ట్వీట్ చేశారు.

నేను ఆరాధించే వ్యక్తుల్లో రిషి సార్ ఒకరు

రిషి కపూర్ మరణవార్త అబద్దం అయితే బాగుంటుంది. నేను ఆరాధించే వ్యక్తుల్లో రిషి సార్ ఒకరు. నాకు అత్యంత ఇష్టమైన సహచర నటుడు. శుద్ద్ దేశీ రొమాన్స్ సినిమా షూట్ సందర్భంగా కంగారు పడితే ఆయన చూపించిన ఆదరణ, ఆప్యాయత ఇంకా గుర్తుంది. ఓ స్నేహితుడిలా ప్రతీ వ్యక్తితో చనువుగా ఉంటారు. ఆయన ఇచ్చిన సలహాలు, ఆయన వేసిన జోకులు ఇంకా గుర్తున్నాయి అంటూ పరిణితి చోప్రా ట్వీట్ చేశారు.

నమ్మబుద్ది కావడం లేదు : దివ్య దత్తా

రిషి కపూర్ మరణించారనే వార్త నమ్మబుద్ది కావడం లేదు. జీవితం అంటే ఏమిటో ఆయనను చూసే నేర్చుకోవాలి. నాకు ఆయన ఫేవరేట్, ఇన్సిపిరేషన్. జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించిన వ్యక్తి. మీతో అనుభూతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆప్యాయత, ప్రేమలకు ప్రతిరూపం మీరు అంటూ దివ్య దత్తా ట్వీట్ చేశారు.

ప్రపంచ సినిమాకు తీరని లోటు.. వేదిక

రిషి కపూర్ మరణవార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. గత రాత్రి మీరు నటించిన చాందినీ చిత్రం మా అమ్మతో చూస్తూ మీ నటనకు ముగ్దులయ్యాం. గొప్ప లెజెండ్ అయిన మీతో నటించే అవకాశం రావడం నిజంగా జీవితానికి ధన్యం. మీరు చూపించిన ఆప్యాతయ, దయాగుణానికి మమల్ని ఎంతో ఆకట్టుకొన్నాయి. మీ మరణం సినీ ప్రపంచానికి మీరు లేని లోటు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అని నటి వేదిక తన అనుభూతులను పంచుకొన్నారు.

క్రిష్ జాగర్లమూడి తీవ్ర దిగ్బ్రాంతితో

రిషి కపూర్ ఇకలేరనే వార్తతో నోట మాటలు రావడం లేదు. రిషి మరణంతో సినీ పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని క్రిష్ జాగర్లమూడి ట్వీట్ చేశారు.

గొప్ప మానవతావాది.. కలైపులి థాను

రిషి కపూర్ నాకు మంచి స్నేహితుడు. గొప్ప మానవతావాది. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కలైపులి థాను ట్వీట్ చేశారు.

దు:ఖం పొంగుకొస్తున్నది.. జానీ లివర్

రిషీ కపూర్ మరణవార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయి ఒకరకమైన షాక్ గురయ్యాను. ఆ వార్త వినగానే దు:ఖం పొంగుకొచ్చింది. ఆయనతో చాలా కాలం కలిసి పనిచేయడంతో ఎన్నో అనుభావాలు, అనుభూతులు గుర్తుకొస్తున్నాయి. దేశం గొప్ప నటుడిని కోల్పోయింది అని హాస్య నటుడు జానీ లీవర్ అన్నారు.

మాటల్లో చెప్పలేని విషాదం

మాటల్లో చెప్పలేని విషాదం. మరో నట దిగ్గజాన్ని సినీ పరిశ్రమ కోల్పోయింది. ఔరంగజేబ్ చిత్రంలో కలిసి నటించే అవకాశం రావడం వరంగా భావిస్తున్నాను. గొప్ప నటుడు. గత, భావి తరాల ప్రేక్షకులు మంచి నటుడిని కోల్పోయారు. రిషి కపూర్ లాంటి నటుడు మళ్లీ జన్మించడం అరుదు అని నటి స్వరభాస్కర్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X